Skip to content

‘గాయపడ్డ సింహం’ నుంచి ‘జింగాలా’ సాంగ్ రిలీజ్

‘గాయపడ్డ సింహం’ నుంచి ‘జింగాలా’ సాంగ్ రిలీజ్ Telugu News
‘గాయపడ్డ సింహం’ నుంచి ‘జింగాలా’ సాంగ్ రిలీజ్ Telugu News

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్, ‘బ్రైడ్ సాంగ్’ అంచనాలు పెంచాయి.
తాజాగా మేకర్స్ జింగాలా సాంగ్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం(తరుణ్ భాస్కర్ ) మనసులో దాగి ఉన్న బాధను, ఆవేశాన్ని, తిరిగి లేచే శక్తిని అద్భుతంగా ఆవిష్కరించే పాట ‘జింగాలా’.
స్వీకర్ అగస్తి సంగీతం ఈ పాటకు ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీని అందించగా, నకాష్ అజీజ్ వోకల్స్ మరింత ఎనర్జీ ఇచ్చింది.
కశ్యప్ శ్రీనివాస్, సునీల్ కరంకంటి, శ్రీని జోస్యులలిరిక్స్ తరుణ్ మనసులోని గాయాలు, కోపం, ప్రతీకారం అన్నీ ఫన్ నోట్ లో ప్రజెంట్ చేశాయి.
బాధను బీట్‌గా మార్చుకుని కంపోజ్ చేసిన పాటలో తరుణ్ భాస్కర్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఇంస్టెంట్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌న, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్‌, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందిస్తున్నారు.
గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కాశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్
బ్యానర్లు: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్
DoP: విద్యా సాగర్ చింత
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి
కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజయ్ వర్మ
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
Vfx & టైటిల్ యానిమేషన్: ఎగ్ వైట్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లోటూత్స్

See also  "K-ర్యాంప్" నుంచి 'టిక్కల్ టిక్కల్..' రిలీజ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.