‘కపాలి’ టెర్రిఫిక్ ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు. రోహిత్ నారా పుట్టినరోజు సందర్భంగా, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌తో పాటు సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'కపాలి' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోహిత్ నారా ఇంటెన్స్ ఎమోషన్స్ తో కనిపిస్తున్నారు. కనిపించని ఓ శక్తితో పోరాడుతున్నట్లు పోస్టర్‌లో చూపించారు. గడ్డం, భయానకమైన చూపులు…
