సూపర్ స్టార్ మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ ‘ఖలేజా’ ప్రీ సేల్ సక్సెస్ మీట్
సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా రీ రిలీజ్ సందర్భంగా ప్రీ సేల్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖలేజా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, కృష్ణ గారి సోదరులు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు, కమెడియన్ అలీ, సునీల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు గారు మాట్లాడుతూ... నిర్మాతలిద్దరితో చాలా మంచి అనుబంధం ఉందన్నారు. పోకిరి సినిమాతో రీ రిలీజ్ మొదలైందన్నారు. ఈ సినిమాను సుబ్బారావు రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు…
