డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”, ఈ నెల 16న టీజర్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 16న ఉదయం 10.52 నిమిషాలకు "రాజా సాబ్" టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్ మెంట్ తో రెబెల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది…
