Skip to content

సందీప్ కిషన్‌తో షైనింగ్ పిక్చర్స్ సినిమా

సందీప్ కిషన్‌తో షైనింగ్ పిక్చర్స్ సినిమా Telugu News
సందీప్ కిషన్‌తో షైనింగ్ పిక్చర్స్ సినిమా Telugu News
సందీప్ కిషన్‌తో షైనింగ్ పిక్చర్స్ సినిమా Telugu News

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు మళ్లీ ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయ్యారు. ‘శంబాల’ తరువాత దర్శక, నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారా? అని అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎదురుచూపుకి సమాధానంగా సందీప్ కిషన్‌తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ సినిమా ప్రకటన కోసం ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్ లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిల్చుని ఉంది. ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు’ అనే క్యాప్షన్ చూస్తే ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శక, నిర్మాతలు సక్సెస్ ఫుల్ హీరో సందీప్ కిషన్‌ను ఎంచుకున్నారు. ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌తో ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఇది దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్ట్. ఈసారి సృజనాత్మక, సాంకేతిక ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాని రూపొందించేందుకు రెడీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఒక గొప్ప సినిమా అనుభూతిని అందించడానికి, నిర్మాతలు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం విషయంలో అన్ని విధాలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ బృందం ఒక భారీ స్థాయి సోషియో-ఫాంటసీ డ్రామాను రూపొందిస్తోంది. ఎక్కువ మందికి చేరువయ్యేలా, విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఘనంగా విడుదల చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.

‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక ఈ నూతన ప్రాజెక్ట్‌తో మరోసారి ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని త్వరలో ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు.

See also  సుందరకాండ'ని ఎంజాయ్ చేస్తారు: నారా రోహిత్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.