Skip to content

ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు “తమ్ముడు” మూవీకి సెన్సార్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ ఎంచుకున్నారు. కట్స్ తో ఈ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ లభించేది. అయితే ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇటీవల "తమ్ముడు" మూవీ కోసం చేసిన ఇంటర్వ్యూస్ లో దిల్ రాజు ఏ తరహా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయో స్పష్టంగా చెప్పారు. "సంక్రాంతికి వస్తున్నాం" లాంటి కంప్లీట్ ఎంటర్ టైనర్స్ లేదా సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు…

Read more

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం నుంచి ‘గల్లి స్టెప్‌ సాంగ్‌ విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా 'గల్లి స్టెప్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. 'ఓ మెరుపులా చిందులే వేయారా' అంటూ కొనసాగే ఈ పాటను కథానాయకుడు సుహాస్‌ ఆలపించడం విశేషం. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన…

Read more

“ఉప్పు కప్పురంబు” మ్యూజిక్ ఆల్బమ్ విడుదల

భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తాజా తెలుగు ఒరిజినల్ సినిమా "ఉప్పు కప్పురంబు" ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్‌ను ఈరోజు విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఈ పాటలు చిత్రంలో చూపించే చిన్న పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా పాడబడ్డాయి. సంగీతాన్ని స్వీకార్ అగస్తి అందించగా, పాటల రాతలు రవికృష్ణ విస్సాప్రగడ, ఎస్. అత్తావుర్ రహీం మరియు రఘురాం ద్రోణావజ్జల చేశారు. ఈ పాటలు పాడిన సీన్ రోల్డన్, అనురాగ్ కులకర్ణి ఆంటోని దాసన్, వీళ్ళ గానంతో పాటలు ఇంకా హృద్యంగా మారాయి.ఒకవైపు నోమిలాలా అనే పాట ఉత్సవాన్ని పాడుతుంటే, మరోవైపు…

Read more

*సోషియోఫాంటసీగా “దీర్ఘాయుష్మాన్ భవ”*

ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా సోషియో ఫాంటసీ ప్రేమకథతో సినిమాగా "దీర్ఘాయుష్మాన్ భవ" చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లు. ఎం.పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై 11న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ తెలిపారు. చక్కటి ఫ్యామిలీ కథాశంతో రెండున్నర గంటలపాటు ప్రీక్షకులను అలరింపజేసే వినోదంతో ఈ చిత్రాన్ని మలచడం జరిగిందని ఆయన చెప్పారు. సోషియో ఫాంటసీ కావడంతో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చాం. ఏ పాటకు ఆ పాట ఆహ్లాదభరితంగా ఉంటుందని అన్నారు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని చెప్పారు. …

Read more

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన ఈ సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో ఇప్పుడు రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న రెండో సినిమాకు…

Read more

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో గురువారం నాడు విష్ణు మంచు, కన్నప్ప టీం మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు తెగాయి. ఇంతటి రెస్పాన్స్ చూసి నాకు ఆనందమేస్తోంది. ఇదంతా శివ లీల అనిపిస్తుంది. ‘కన్నప్ప’ మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు. అది వారి…

Read more

రవితేజ “మిరపకాయ్” జులై 11న రీ రిలీజ్

మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్టూ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. రవితేజ హీరోగా ఎల్లో ప్లవర్స్ బ్యానర్ పై నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించిన చిత్రం ‘మిరపకాయ్’. 2011 సంక్రాంతికి విడుదలై మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్, ట్రైలర్ కు అభిమానుల నుండి అలాగే సినీ ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జులై 11న ‘మిరపకాయ్’…

Read more

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు నటి లయ. "తమ్ముడు" సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు నటి లయ. - నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. ఇక్కడ…

Read more

తెలుగు సినీ & టివి కాస్టూమర్స్ యూనియన్ నాయకుల దోపిడీని అరికట్టండి

న్యాయం జరిగేవరకు మా పోరాటం ఆగదు! భూ పోరాట సమితి కన్వీనర్ సీనియర్ సభ్యులు రమేష్ "తెలుగు సినీ & టివి కాస్టూమర్స్ యూనియన్ నాయకుల దోపిడీని అరికట్టండి" అని పిలుపునిస్తున్నారు సదరు సంఘం సీనియర్ సభ్యులు, భూ పోరాట సమితి నాయకులు రమేష్. ఆయన మాట్లాడుతూ... "తెలుగు సినీ అండ్ టీవీ కాస్ట్యూమర్స్ యూనియన్ 330 మంది సభ్యులకి 2017 సంవత్సరంలో మెంబర్స్ అందరికీ భూమి కొనిస్తామని డబ్బులు వసూలు చేసి 20 ఎకరాలకి అగ్రిమెంట్ చేసి 16 ఎకరాల 36 గుంటలకి యూనియన్ నుంచి డబ్బు కట్టి 13 ఎకరాల 12 గుంటలకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి ప్రస్తుతానికి భూమి అంతా పోయినట్టు చెబుతూ 7 ఎకరాల 2 గుంటలు…

Read more