Skip to content

కొదమసింహం” సినిమా నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ, ప్రేక్షకులు ఈ సినిమా రీ రిలీజ్ ను తప్పకుండా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు – మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా "కొదమసింహం" సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ ప్రీమయర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో స్పెషల్ వీడియో ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - కొదమసింహం…

Read more

డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా

తెలంగాణ ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్ లో తినుబండారాల రేట్స్, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహించారు. టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సారథ్యంలో జరిగిన ఈ మహాధర్నాలో నిర్మాతలు లయన్ సాయి వెంకట్, గురురాజ్, డీఎస్ రెడ్డి, రవి, నటుడు, హీరో సన్నీ, దర్శకుడు సిరాజ్ తో పాటు పలువురు దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు ప్రొడ్యూసర్స్ తమ స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల…

Read more

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా “కిల్లర్” సర్ ప్రైజ్ చేస్తుంది – ‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంఛ్ లో డైరెక్టర్ పూర్వజ్

జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను ఈ రోజు హైదరాబాద్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ - జ్యోతి గారు తనకు యాక్షన్ తెలియదు…

Read more

‘పాంచ్ మినార్’ సినిమా అంతా చాలా ఫన్ ఉంటుంది: హీరో రాజ్ తరుణ్

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. పాంచ్ మినార్ ఎప్పుడు మొదలైంది? ఈ కథ ఎలా ఉండబోతుంది ? -సినిమాని ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాం. ఇది ప్రాపర్ క్రైమ్ కామెడీ. కథ నుంచి బయటికి…

Read more

పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు మీడియా సమక్షంలో ధన్యవాదాలు తెలిపిన తెలుగు చిత్ర పరిశ్రమ

భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఐబొమ్మ అని పైరసీ వెబ్సైటు ఓనర్ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు. దీనికోసం కష్టపడి పనిచేసిన పోలీసు బృందంకి, ప్రభుత్వానికి అలాగే ఛాంబర్ నందు ఉన్న పరిసి సెల్ వారికి కృతజ్ఞతలు. నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ... "చిత్ర పరిశ్రమ కోసం డిపార్ట్మెంట్ నుండి సీనియారిటీ ఉన్న పోలీసులు పని చేశారు. ఈ ప్రయత్నంలో విదేశి పోలీసులు కూడా మనకి సాయం చేశారు. దేశం మొత్తంలో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే పైరసీ సెల్ మెయింటైన్ చేస్తుంది. చాలా కష్టపడి ఐబొమ్మ రవిను పట్టుకున్నారు…

Read more

విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

వెర్సటైల్ హీరో విశాల్‌ స్వీయ దర్శకత్వంలో ‘మకుటం’ చిత్రం రాబోతోంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ సంచలనంగా మారాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వరుసగా 17 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసినట్టుగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ నుంచి ఓ ప్రెస్ నోట్‌ని కూడా రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే.. ‘విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మకుటం’ సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. 17 రోజులుగా నిర్విరామంగా షూటింగ్ చేశాం. ఇంటెన్స్‌తో కూడిన…

Read more

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా రిలీజైన రోజు నుంచి నా జీవితం మారిపోతుంది – హీరో అఖిల్ రాజ్

"రాజు వెడ్స్ రాంబాయి" చిత్రానికి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - హీరోయిన్ తేజస్వినీ అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ…

Read more

“ఆపరేషన్ పద్మ” ట్రైలర్ విడుదల

నరేష్ మేడి, రాగ్, రజిత శాండీ, రణధీర్ బీసు, రాఘవ మందలపు, పెద్ది రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ పద్మ". ఈ చిత్రాన్ని క్రిషవ్ సినిమాస్, కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్పీ బ్యానర్స్ పై ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మందలపు, రాంబాబు మందలపు నిర్మిస్తున్నారు. కార్తీక్ మందలపు కో ప్రొడ్యూసర్ గా, కె టి మల్లికార్జున క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ.వి. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం "ఆపరేషన్ పద్మ" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ రైటర్ ప్రేమ్ రాజ్ ఎనుముల మాట్లాడుతూ - "ఆపరేషన్ పద్మ" సినిమాను…

Read more

రాజ్ తరుణ్ “టార్టాయిస్” చిత్రం ప్రారంభం

“పగలు రాత్రి కలవకూడదు అన్నది దైవ నిర్ణయం అయితే, కత్తి తో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు. వాడు ఎప్పటికి సాక్షిగా రాడు. కష్టాల్లో వున్న వాళ్ళని కాపాడే వాడే కథానాయకుడు. కానీ ఆ కాపాడే వాడే చంపడం మొదలు పెడితే “ ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు సంయుక్తంగా…

Read more

‘ప్రేమంటే’ ఫన్ థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్ ట్రైలర్ రిలీజ్

ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యూట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. కొత్తగా పెళ్ళయిన జంట జీవితంలోని…

Read more