Skip to content

బ్లాక్‌బస్టర్‌ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ‘పతంగ్‌’ లో ఉన్నాయి: ట్రైలర్ ఆవిష్కరణలో దర్శకుడు దేవా కట్టా

ట్రైలర్‌ ఆవిష్కరణలో దర్శకుడు దేవకట్టా ప్రతిష్టాత్మక సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’ ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. పాపులర్‌ దర్శకుడు నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు. ఈసందర్భంగా దేవ కట్టా మాట్లాడుతూ ‘ ట్రైలర్‌ ఎంతో ఎనర్జిటిక్‌,ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. రమ్య ఈ సినిమాకు వన్‌ ఆఫ్‌ ద ప్రొడ్యూసర్‌ అవ్వడం హ్యపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు ఈ సినిమా హీరో ప్రణవ్‌ సరిగమప నుంచి తెలుసు. ఇదొక కొత్తరకమైన సినిమా. ఈ సినిమా చాలా కష్టపడి తీశారు. ట్రైలర్‌ చూడగానే సూపర్‌ థ్రిల్ల్‌గా ఫీలయ్యాను. ఓ సూపర్‌హిట్‌ సినిమాకు. బ్లాక్‌బస్టర్‌ సినిమాకు కావాల్సిన ఆల్‌ ద ఎలిమెంట్స్‌ ఉన్నాయి. . పతంగ్‌ చూడగానే యూత్‌కు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఫ్రెండ్‌ షిప్‌ ఉంది. లవ్‌ ఉంది. గ్రేట్‌ మ్యూజికల్‌ ఎనర్జీ ఉంది. ఆర్టిస్టులు అందరూ ఎంతో ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా థియేటర్‌లో ఆడియన్స్‌ అలరిస్తుందనే నమ్మకం ఉంది. నిర్మాత నాని బండ్రెడ్డి గతంలో నేను ఆటోనగర్‌ సూర్య అప్పుడు హీరో ఎవరో తెలియనప్పుడు ఓ వాయిస్‌ టీజర్‌ వదిలాను. అది అప్‌లోడ్‌ చేశాను. దానికి మంచి స్పందన వచ్చింది. అప్పుడు వాయిస్‌ టీజర్‌కు పవన్‌కల్యాణ్‌ గారిని పెట్టి నాని ఓ ఎడిట్‌ చేశాడు. అది చూసిన పవన్‌ కళ్యాణ్‌ గారు నన్ను పిలిపించి నా కోసం రాసుకున్నావా ఈ కథ అన్నాడు. నాకు తెలియకుండానే నానితో ఈ అనుబంధ ఉంది. ఈ రోజు నాని ప్రొడ్యూస్‌ చేసిన సినిమాకు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. సినిమాకు హిట్‌ కళ కనిపిస్తుంది. ఈ సినిమా అందరికి మంచి పేరును తీసుకరావాలి అన్నారు. సహ నిర్మాత రమ్య వేములపాటి మాట్లాడుతూ పతంగ్‌ల పోటీ అనేది అందరికి చిన్నప్పడి నుంచి మంచి అనుబంధం ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా అందరికి కొత్త అనుభూతినిస్తుంది. రియలిస్టిక్‌ సినిమాటిక్‌ ఫీల్‌ను కలిగిస్తుంది’ అన్నారు. వంశీ పూజిత్‌ మాట్లాడుతూ ” నేను ట్రైలర్‌ ఇప్పుడు చూశాను. మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించింది. పతంగుల కాంపీటిషన్‌ షాట్‌లు వీఎఫ్‌ఎక్స్‌లో అద్బుతంగా చేశారు. చివరి 30 నిమిషాలు పతంగ్‌ కాంపీటీషన్‌ ఏపిసోడ్‌ సూపర్‌గా ఉంటుంది. ఈ నెల 25న మా టీమ్‌ ప్రతిభ తెలుస్తుంది. ఈ సినిమాలో నా పేరు విస్కి. నేను పక్కా హైదరాబాదీ.. గ్రేట్‌ మాస్‌ పాత్ర. అందరూ నా పాత్రను లవ్‌ చేస్తారు. విస్కీ చాలా స్పెషల్‌. ది బెస్ట్‌ ఫిలిం ఈఇయర్‌కు ఇస్తున్నాం అనే నమ్మకం ఉంది. తెలుగు సినిమా గర్వంగా ఫీలయ్యే సినిమా ఇది. ఈ సినిమా విడుదల రోజు నా పుట్టినరోజు కావడం విశేషం. ప్రణవ్‌ కౌశిక్‌ మాట్లాడుతూ ” నా ఫస్ట్‌ ఫిలిం. దాదాపు మా ఆర్టిస్టులందరికి మొదటి సినిమా.. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా గట్స్‌ ఉండాలి. కరేజ్‌ కావాలి. మా ప్రొడ్యూసర్స్‌కు అవి ఉన్నాయి. ఈ సినిమాను పెద్ద సినిమాకు తగ్గకుండా చేశారు. కంటెంట్‌ పరంగా పెద్ద సినిమా ఇది. నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు హ్యపీగా ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ కైట్స్‌ కాంపీటీషన్‌ షాట్స్‌ చాలా కష్టపడి చేశారు. ఈ నెల 25న నాకు అన్ని విధాల సపోర్ట్‌ చేసిన నా అమ్మ నాన్నకు హిట్‌ ఇవ్వబోతున్నాను అన్నారు. వడ్లమాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇది నా వందో సినిమా. ఈ యూత్‌ఫుల్‌ బ్యాచ్‌తో చేసిన సినిమా ఇది. కొత్త ఎనర్జీ వచ్చింది. నాని బండ్రెడ్డి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. అసాధ్యుడు. చిన్న చినుకు ఏరులా మారుతుంది. ఈ ఏరు హోరు.. ఈ హోరు సముద్రంలా చినుకులా మొదలైన ఈ సినిమా మహా సముద్రం అంతా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్‌ఎండ్‌ లో రాబోయే ఈ సినిమా వందల కోట్లు వసూలు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌ మోపిదేవి, సీఈవో ఆదినారాయణ, నాని బండ్రెడ్డి, నిర్మాత సంపత్ మక తదితరులు పాల్గొన్నారు.