మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'పెద్ది'…
‘సైక్ సిద్ధార్థ’ సినిమాని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు – నిర్మాత డి. సురేశ్ బాబు

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జనవరి 1న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాలకి ముఖ్యంగా చిన్న సినిమాలకి ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గిపోతుందని తరుచు మాట్లాడుతుంటాం. అయితే కొన్నిసార్లు చిన్న సినిమాలని ఆడియన్స్ చాలా అద్భుతంగా ధియేటర్స్ లో ఆదరిస్తున్నారు. రాజు వెడ్స్ రాంబాయి లిటిల్ హార్ట్స్ లాంటి కొన్ని సినిమాల్లో వస్తున్నాయి. అలాగే ఇతర భాషల్లో కూడా చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తున్నాయి. చిన్న సినిమాలపై హోప్ అయితే ఉంది. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి కారణం డైరెక్టర్ వరుణ్ సినిమాని చాలా డిఫరెంట్ ప్రజెంట్ చేశాడు. సినిమాని చూసిన వెంటనే తీసుకోమని చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమా తీశారు. సినిమా బాగుంటే ఆడియన్స్ కచ్చితంగా చూస్తున్నారు. అలాగే టికెట్ రేట్స్ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటున్నాము. ఈ సినిమా టికెట్ కేవలం 99 రూపాయలు మాత్రమే. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
హీరో శ్రీ నందు మాట్లాడుతూ… అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. దండోరా లో నా పర్ఫార్మెన్స్ కి చాలా మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు అది నాకు మంచి బూస్ట్ ఇచ్చింది. 31 నైట్ డల్లాస్ లో గీత స్పెషల్ షో అరేంజ్ చేసాము. అక్కడ గీతతో పాటు స్పెషల్ చూడాలని కోరుతున్నాను. 2026 తెలుగు సినిమా సైక్ సిద్ధార్థ తో ప్రారంభం కాబోతుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది నీ ఒక మంచి సక్సెస్ తోనే ముగించినందుకు చాలా ఆనందంగా ఉంది. 2025 నాకు చాలా మంచి ఇయర్ దండోరా హిట్ అయింది. అలాగే సురేష్ బాబు గారు మా సినిమాని తీసుకున్నారు. 2026 జనవరి 1న సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాకి చాలా కష్టపడి ప్రమోషన్స్ చేసాం. అయితే అనుకోని పరిస్థితులలో సినిమా వాయిదా పడాల్సి వచ్చింది. అప్పుడు నిజంగానే భయపడ్డాను. అయితే ఏం జరిగినా మన మంచికే ధైర్యంగా ఉండాలి అని చెప్పిన మా నాన్న గారి మాట గుర్తొచ్చింది. మళ్లీ ఒక ఉత్సాహంతో ఈ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అందరి ముందుకు వస్తున్నా. 100% చెబుతున్న ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా చాలా బలంగా ఉంటుంది. మేము చాలా మంచి సినిమా తీశాం. అది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.
డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. థియేటర్స్ కి వచ్చి గట్టిగా కేకలు వేసి ఫుల్ గా ఎంజాయ్ చేసే తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా అంకితం. కనీసం 30 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా కేకలు వినిపిస్తాయి. అది మేము ప్రీమియర్స్ లో కూడా చూసాము. ఈ సినిమా ఇంత అద్భుతంగా మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా పాషన్ తో ఈ సినిమా చేశాం. ప్రతి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.ఈ సినిమాని సపోర్ట్ చేసిన సురేష్ బాబు గారికి రానా గారికి థాంక్యూ
హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీడియా అందరికీ థాంక్యు. మీ సపోర్ట్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. మళ్లీ సినిమాలు చేయాలనే ధైర్యం ఈ సినిమా ఇచ్చింది. జీవితంలో సెకండ్ ఛాన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నా కెరియర్ లో ఒక సెకండ్ ఛాన్స్. మీరు అందరు కూడా నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇది న్యూ ఏజ్ ఫిలిం. అందరూ కనెక్ట్ అవుతారు.
మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ సాయి మాట్లాడుతూ.. ఇది చాలా మంచి ఫన్ సినిమా. దాదాపు 100 సార్లు సినిమా చూశాను. చూసిన ప్రతిసారి విపరీతంగా ఎంజాయ్ చేశాను. నా మ్యూజిక్ టీం కి, డైరెక్షన్ టీం కి అందరికీ థాంక్యూ. జనవరి 1న అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను.
