Skip to content

రాకాస’ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి.. -అనిల్ రావిపూడి

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సమ్మర్ ఫన్‌టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌‌ను నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
*అనిల్ రావిపూడి మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ టీంకి బిగ్ కంగ్రాట్స్. ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి. నిహారిక చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఓ మూవీని ఆడియెన్స్‌కి ఎంత వరకు రీచ్ చేయాలో, ఎలా ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేశారు. ఐపీఎల్ సీజన్‌లోనూ ‘రాకాస’ కోసం ఆడియెన్స్ వస్తుండటం గొప్ప విషయం. కామెడీ ఉంటే జనాలు కచ్చితంగా థియేటర్‌కు వచ్చి సినిమాని చూస్తారు. నేను ఇంకా ఈ మూవీని చూడలేదు. కాకపోతే చాలా ఎపిసోడ్స్ చూశాను. అవి చూస్తేనే సంగీత్, గెటప్ శ్రీను, నయన్, వెన్నెల కిషోర్ గారి కామెడీ చూసి పగలబడి నవ్వేశాను. అనుదీప్ బీజీఎం, పాటలు బాగున్నాయి. ఓ అమ్మాయి (మానస శర్మ) డైరెక్టర్‌గా వచ్చి ఇంకో అమ్మాయి (నిహారిక) నిర్మాతగా నిలబడి.. బ్లాక్ బస్టర్ కొట్టారంటే హ్యాట్సాఫ్. వారిద్దరూ అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. మానస శర్మ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. సంగీత్ ఇలానే కంటిన్యూగా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. సమ్మర్‌లో రాబోతోన్న అన్ని చిత్రాల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నిహారిక కొణిదెల మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ని థియేటర్లో చూసి సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. ‘రాకాస’ విజయంలో వెన్నెల కిషోర్ గారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో వెన్నెల కిషోర్ గారు షూట్ చేసి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘రాకాస’కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సుఖ్వేందర్ సింగ్ గారు కూడా రాకాస పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ టైంలో అనిల్ రావిపూడి గారు ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు మళ్లీ మా కోసం ఆయన వచ్చారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కి కామెడీ అంటే అనిల్ రావిపూడి గారు గుర్తుకు వస్తారు. ఆయన సంక్రాంతికి సక్సెస్ కొట్టారు. ఇప్పుడు మేం సమ్మర్‌లో ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేశామని అనుకుంటున్నాం. క్లీన్ కామెడీ చిత్రంగా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రంగా ‘రాకాస’ నిలిచింది. ‘రాకాస’ విజయం ప్రేక్షకులదే’ అని అన్నారు.
*సంగీత్ శోభన్ మాట్లాడుతూ ..* ‘అనిల్ రావిపూడి గారి సినిమాల్ని ఢీ కొట్టలేం గానీ.. ఆయన ప్రమోషన్స్‌ని ఢీ కొట్టాలని మేం అనుకున్నాం. మూవీని వీలైనంత వరకు ఆడియెన్స్ వరకు రీచ్ చేయగలగాలి. వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్ ప్రైజ్‌గా ఇంట్రడ్యూస్ చేయాలని ముందు నుంచీ అనుకున్నాం. ఆయన ఎంట్రీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన నిహారిక గారు, మానస శర్మ గారికి థాంక్స్. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ ఈవెంట్‌ను పెట్టాం. మహిళలు తరిలి వచ్చి మా సినిమాని చూస్తున్నారంటే మా కంటెంట్ వారికి నచ్చిందని భావిస్తున్నాం. మా మూవీని ఇంతలా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
*నయన్ సారిక మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ని సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిహారిక, మానస శర్మకు థాంక్స్. థియేటర్లో చిన్న వాళ్లు, పెద్ద వాళ్లు మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే నాకెంతో సంతోషంగా అనిపించింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్’ అని అన్నారు.
*మానస శర్మ మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ నాకు మొదటి ఫీచర్ ఫిల్మ్. థియేటర్లో ఆడియెన్స్‌తో కలిసి ఈ మూవీని చూశాను. నేను ఏదైతే రాసుకున్నానో.. ఏదైతో అనుకున్నానో.. ఆ సీన్లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నా నిర్మాతలు నిహారిక, జీ స్టూడియో, డిస్ట్రిబ్యూటర్లు సినిమా పట్ల, రిజల్ట్ పట్ల సంతృప్తిగా ఉన్నారు. వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్ ప్రైజింగ్‌గా ఉంచాలని అనుకున్నాం. ఆ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. గెటప్ శ్రీను గారు మాకెంతో సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చిన అన్వర్ గారు, అనుదీప్ గారు, విష్ణు గారు, మురళీ గారు, రాజు గార్లకు థాంక్స్. మా చిత్రానికి సపోర్ట్ ఇచ్చిన మీడియాకి థాంక్స్’ అని అన్నారు.
*జీ స్టూడియోస్ దివ్యా విజయ్ మాట్లాడుతూ ..*‘‘రాకాస’ సక్సెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా డిస్ట్రిబ్యూటర్లందరికీ థాంక్స్. మంచి సినిమా వస్తే ఎంకరేజ్ చేస్తామని తెలుగు ఆడియెన్స్ మరోసారి నిరూపించారు’ అని అన్నారు.
*అనుదీప్ దేవ్ మాట్లాడుతూ ..* ‘‘రాకాస’కి ఏడాది పాటు కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వస్తుంటే మళ్లీ సంక్రాంతి సీజన్ వచ్చినట్టు అనిపించింది’ అని అన్నారు.

*డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ బిగ్ హిట్‌గా నిలిచింది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్. వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ కాబోతోంది. ‘రాకాస’ టీం ప్రమోషన్స్ చూస్తుంటే ఇంకో నాలుగు వారాల రన్ ఉండేలా కనిపిస్తోంది’ అని అన్నారు.