-“లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను: నిర్మాత…
‘సత్తిబాబు పరలోక యాత్ర’ షూటింగ్ ప్రారంభం

యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “కపుల్ ఫ్రెండ్లీ” మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా థియేటర్స్ తో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. తమిళనాట 50 రోజులు ప్రదర్శితమై అక్కడా బాక్సాఫీస్ విజయాన్ని దక్కించుకుంది. తెలుగు హీరో నటించిన సినిమా తమిళనాట 50 రోజులు ప్రదర్శితం కావడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ సక్సెస్ ఉత్సాహంలో సంతోష్ శోభన్ తన కొత్త మూవీ “సత్తిబాబు పరలోక యాత్ర” షూటింగ్ కు సిద్ధమవుతున్నారు.
“సత్తిబాబు పరలోక యాత్ర” సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ తెలుగు, తమిళంలో నిర్మిస్తోంది. “స్వాతిముత్యం” సినిమా ఫేమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కె కృష్ణ రూపొందిస్తున్నారు. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న “సత్తిబాబు పరలోక యాత్ర” మూవీ జూన్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంగా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటుల – సంతోష్ శోభన్, తదితరులు
టెక్నికల్ టీమ్
———————
సమర్పణ – యూవీ క్రియేషన్స్
బ్యానర్ – ఏఆర్ ఫిలింస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – లక్ష్మణ్ కె కృష్ణ
