Skip to content

‘సెయాన్’ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

వర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో, కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం కోసం చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అమరన్ తర్వాత శివకార్తికేయన్ మరోసారి రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కొలాబరేట్ కావడం విశేషం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆ చిత్రంతో ఏర్పడిన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు మరింత బలపడింది.

గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “సెయాన్” అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. 2026లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ స్పెక్టకిల్‌గా నిలిచేలా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, వినోదాన్ని మేళవిస్తూ ఈ సినిమా రూపొందుతోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివకార్తికేయన్ డివైన్ ల్లూక్ కనిపిస్తున్నారు. ధోతి, విభూతి, రుద్రాక్షలతో సంప్రదాయానికి దగ్గరగా కనిపిస్తూ, చేతిలో వంపు ఉన్న కత్తి ఆయన ప్రశాంతత వెనుక దాగిన శక్తిని సూచిస్తోంది. వెనుకన కనిపించే నెమలి రెక్కలు, చుట్టూ ఉన్న నెమళ్లు మురుగన్ స్వామి ప్రతీకను గుర్తు చేస్తూ పాత్రకు మిథికల్ ఆరా అందిస్తున్నాయి. ఈ చిత్రంలో శివకార్తికేయన్ పవర్‌ఫుల్, డైనమిక్ పాత్రలో కనిపించనున్నారు.

రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శివకార్తికేయన్, ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కలిసి పనిచేస్తున్న తొలి సినిమా కావడం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకగా నిలిచింది. తన ప్రత్యేకమైన మ్యూజికల్ స్టైల్‌తో, చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్‌తో పేరుగాంచిన సంతోష్ నారాయణన్ సంగీతం ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లెగసీ, టర్మరిక్ మీడియా విజన్ కలిసిన “సెయాన్” 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలవనుంది.

నటీనటులు, సాంకేతిక బృందం, రిలీజ్ వివరాలపై మరిన్ని అప్‌డేట్స్ త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.

తారాగణం: శివకార్తికేయన్

దర్శకత్వం: శివకుమార్ మురుగేశన్
నిర్మాత: కమల్ హాసన్ – ఆర్. మహేంద్రన్
బ్యానర్స్: రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా
సంగీతం: సంతోష్ నారాయణన్