Skip to content

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ‘శుద్ధ్ విలాస్’.. దుబాయ్‌లో గ్రాండ్ ఓపెనింగ్

‘శుద్ద్ విలాస్’ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తన రుచుల్ని అందించబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భోజన ప్రియులకు ‘శుద్ద్ విలాస్’ ఎంతో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘ట్రెడిషన్ సర్వ్డ్ ఇన్ స్టైల్’ అనే మోటోతో ‘శుద్ద్ విలాస్’ దూసుకుపోతోంది. ఇప్పటికే మల్కాజ్ గిరి, మలేషియాలో ‘శుద్ద్ విలాస్’ బ్రాండ్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో నూతన బ్రాంచ్‌ని కూడా ప్రారంభించారు.

మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో దుబాయ్‌కి ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ మన తెలుగు వాళ్లు ఎక్కువగా నివసిస్తుంటారు. మన వారి కోసం మన రుచుల్ని అందించేందుకు ‘శుద్ద్ విలాస్’ను అక్కడ ప్రారంభించారు. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో ‘శుద్ద్ విలాస్’ను అక్కడ గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ న్యూ బ్రాంచ్ డిస్కవరీ గార్డెన్స్‌లోని జెబెల్ అలీ విలేజ్‌లోని స్ట్రీట్ నంబర్ 1, బిల్డింగ్ నంబర్ 12 వద్ద ఉంది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి మార్గదర్శకత్వంలో ఈ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

దుబాయ్‌లో ‘శుద్ద్ విలాస్’ ప్రారంభం విస్తృత మిడిల్ ఈస్ట్రన్ వ్యూహానికి నాంది పలికింది. శశికాంత్, శ్రీరామ్ బ్రాండ్ వ్యవస్థాపకులు కాగా.. ప్రవీణ్, శ్రీనివాస్, వెంకట్ మార్తాండ్, సాగర్, హుస్సేన్ దుబాయ్ బ్రాంచ్‌కు భాగస్వాములుగా ఉన్నారు. ‘శుద్ధ్ విలాస్’ బ్రాంచ్ త్వరలో షార్జా, అబుదాబి, ఖతార్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాంతం అంతటా అదనపు శాఖలను ప్లాన్ చేస్తోంది. ఇవే కాకుండా హైదరాబాద్‌లోని అల్కాపురి టౌన్‌షిప్‌లో ఒక కొత్త శాఖ ప్రారంభం కానుంది. ప్రస్తుతం వైజాగ్ , విజయవాడలో బ్రాంచ్ ఓపెనింగ్‌కు చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్ అంతర్జాతీయ వెంచర్‌ల కోసం యునైటెడ్ స్టేట్స్ రోడ్‌మ్యాప్‌లో ఉందని వ్యవస్థాపకులు ధృవీకరించారు. ఆసియా, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికా అంతటా కూడా ‘శుద్ద్ విలాస్’ బ్రాండ్‌ను విస్తరింపజేయాలనే లక్ష్యంతో ఫౌండర్స్ ముందుకు వెళ్తున్నారు.