Skip to content

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ వాయిదా.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ వాయిదా.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల Telugu News

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న యుద్ద వాతావరణం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో టాక్సిక్‌ను మార్చి 19న విడుదల చేయడం భావ్యం కాదని మేకర్లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూన్ 4, 2026కి వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

ఓవర్సీస్‌లో ప్రధాన పంపిణీ భాగస్వామి ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటంతో విడుదలను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే కొత్త డేట్‌ను ప్రకటించారు. మార్చి 8న బెంగళూరులో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కోసం నిర్మాతలు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ని కూడా వాయిదా వేశారు. అన్ని ప్రమోషనల్ కార్యక్రమాల్ని ‘టాక్సిక్’ యూనిట్ ప్రస్తుతం నిలిపి వేసింది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఇతర వివరాల్ని టీం ప్రకటించనుంది.

ఈ మేరకు కేవీఎన్ ప్రొడక్షన్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ‘‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం నిర్మించాం. కన్నడ, ఇంగ్లీషు భాషల్లో చిత్రీకరించిన ఈ మూవీని అన్ని భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశాం. ఎంతో అంకిత భావం, ఎన్నో ఏళ్ల శ్రమతో తీసిన మా సినిమాని మార్చి 19న రిలీజ్ చేసి మా ఆనందాన్ని అందరితో పంచుకోవాలని మేం అనుకున్నాం. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ద వాతావరణంతో మేం మా నిర్ణయాన్ని మార్చుకున్నాం.

మా భాగస్వాములు, మా ప్రేక్షకుల ప్రయోజనాల దృష్ట్యా మా సినిమా విడుదలను తిరిగి షెడ్యూల్ చేయడానికి మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. ఇలానే మీ ప్రేమ, అభిమానం, సహకారం మాతో ఉంటాయని ఆశిస్తున్నాం. ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, భారతీయ భాషలలో జూన్ 4, 2026న విడుదల అవుతుంది’ అని ప్రకటించారు.

‘టాక్సిక్’ చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్, నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. యశ్ రచన, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీని కన్నడ, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేశారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలోకి డబ్బింగ్ రూపంలో రానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ జూన్ 4, 2026న విడుదల కానుంది.

See also  'హరి హర వీరమల్లు' హక్కులకు పెరిగిన డిమాండ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.