Skip to content

దర్శకుడు భారతీరాజా మృతి పట్ల చిరంజీవి సంతాపం

దర్శకుడు భారతీరాజా మృతి పట్ల చిరంజీవి సంతాపం Telugu News

దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

‘‘భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. గ్రామీణ మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల అందాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన తన సినిమాల ద్వారా శాశ్వతమైన సినీ కవిత్వంగా మలిచి మనకి అందించారు. ఆయన చిత్రాలు లక్షలాది ప్రేక్షకుల హృదయాలను తాకడమే కాకుండా తరతరాల సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి.

పద్మశ్రీతో పాటు పలు జాతీయ పురస్కారాలను అందుకున్న భారతీరాజా గారు, భారతీయ సినిమాకు చేసిన సేవలు వెలకట్టలేనివి.

‘ఆరాధన’ చిత్రంలో ‘పులిరాజు’ పాత్రలో ఆయన దర్శకత్వంలో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకున్న అపారమైన ప్రేమ, నిరాడంబరత, తన కళ పట్ల అంకితభావం నాపై చెరగని ముద్ర వేశాయి.

ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన అద్భుతమైన చిత్రాల రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉంటారు.

“ఇయక్కునర్ ఇమయం” భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

See also  పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.