Skip to content
దర్శకుడు భారతీరాజా మృతి పట్ల చిరంజీవి సంతాపం Telugu News

దర్శకుడు భారతీరాజా మృతి పట్ల చిరంజీవి సంతాపం

దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. గ్రామీణ మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల అందాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన తన సినిమాల ద్వారా శాశ్వతమైన సినీ కవిత్వంగా మలిచి మనకి అందించారు. ఆయన చిత్రాలు లక్షలాది ప్రేక్షకుల హృదయాలను తాకడమే కాకుండా తరతరాల సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. పద్మశ్రీతో పాటు పలు జాతీయ పురస్కారాలను అందుకున్న భారతీరాజా గారు, భారతీయ సినిమాకు చేసిన సేవలు వెలకట్టలేనివి. ‘ఆరాధన’ చిత్రంలో ‘పులిరాజు’ పాత్రలో ఆయన దర్శకత్వంలో పనిచేసే అదృష్టం…

Read more