Skip to content

‘సిగ్మా’ ఫ్యామిలీ అందరితో కలిసి హ్యాపీగా చూసే సినిమా: ఫారియా అబ్దుల్లా

సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సిగ్మా జర్నీ గురించి?
-సిగ్మా నా ఫస్ట్ తమిళ్ సినిమా. లైకా లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ బ్యానర్‌లో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది మంచి యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్. మంచి టెక్నీషియన్స్, నటీనటులు ఈ సినిమాకి పనిచేశారు.

-ఇందులో నా క్యారెక్టర్ రేడియో జాకీ. ఈ సినిమాలో నాకు మంచి ఎమోషన్స్ చూపించే అవకాశం దొరికింది. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ప్రజెంట్ చేశాను. ఫ్యామిలీతో కలిసి మీరు సినిమా చూడొచ్చు.

మత్తు వదలరా నుంచి మీరు కాస్త యాక్షన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు అనిపిస్తుంది?
-యాక్షన్ నా పర్సనాలిటీకి కూడా నప్పుతుంది. నాకు అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. యాక్షన్ సినిమాలు చేయడం కూడా ఇష్టపడతాను.

సందీప్ కిషన్ గారితో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?
-సందీప్ గారు నాకు ఎప్పటినుంచో తెలుసు. మా ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాము. ఫైనల్‌గా సిగ్మాతో కుదిరింది. ఇందులో మా క్యారెక్టర్స్ లో చాలా కొత్తదనం వుంటుంది.

జేసన్ గారు కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-జేసన్ జూమ్ కాల్‌లో కథ చెప్పారు. కథ మొత్తం విన్న తర్వాత ఆయన ఏజ్ ఎంత అని అడిగాను. 24 ఏళ్లు అని చెప్పారు. నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. తను విజయ్ గారి అబ్బాయి. కాకపోతే అలాంటి ఫీలింగ్‌ను మనలో కలిగించరు. చాలా వినయంగా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతారు.

-తనకు డైరెక్షన్ మీద మంచి కమాండ్ ఉంది. తొలి సినిమా అయినప్పటికీ ఎంతో క్లారిటీ ఉన్న విజన్‌తో తీశారు. తన సెట్‌ను హ్యాండిల్ చేసిన విధానం చాలా కూల్‌గా ఉంటుంది.

-తమిళ్‌లో ఎక్కడికి వెళ్లినా సరే చాలా ప్రేమ ఇస్తున్నారు. సందీప్, జేసన్‌కి అక్కడ చాలా లవ్ ఉంది. అదంతా నాకు కూడా కలిసి వచ్చింది.

ఈ ట్రైలర్ రాజమౌళి గారు రిలీజ్ చేశారు కదా.. ఆయన ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు?
-ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్‌లా ఉంది అని చెప్పారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు మీరందరూ చాలా ఫన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసుంటారని అన్నారు. నిజంగానే మేము చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. నాకు సిగ్మా 2 కూడా చేయాలని ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తే సిగ్మా 2 చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నాను. కాకపోతే ఈ కథ ఇక్కడితో క్లోజ్ అవుతుంది.

తమిళ్‌కి వెళ్లారు కదా.. అక్కడి పరిశ్రమకు, ఇక్కడి పరిశ్రమకు ఏదైనా తేడా గమనించారా?
-పరిశ్రమ ఒకలాగే ఉంది. కాకపోతే ఆహారపు అలవాట్లు కొంచెం భిన్నంగా ఉన్నాయి. సిగ్మా లాంటి మంచి ప్రాజెక్ట్ తో తమిళ్ లో పరిచయం కావడం హ్యాపీగా ఉంది.

తమన్ మ్యూజిక్ గురించి?
తమన్ గారి బీజీఎం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆయన సిగ్నేచర్ మీకు కనిపిస్తుంది. ఇందులో చివర్లో సిగ్మా స్టైల్ పాట ఉంది. ఆ పాటను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. పాటలు రీచ్ అవ్వడం నాకు అడ్వాంటేజ్‌గా అయింది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది?
చాలా హ్యాపీగా ఉంది. ఇది నాకు వాళ్లతో రెండో సినిమా.

దర్శకత్వం చేసే ఆలోచన వుంది?
-నాకు దర్శకత్వం పై ఆసక్తి ఉంది. కొన్ని కథలు రాస్తున్నాను. కాకపోతే దానికి ఇంకా సమయం వుంది. నేను దర్శకత్వం చేస్తే సినిమాలో నేను నటిస్తాను.

తమిళ్‌లో కొత్త ఆఫర్స్ వచ్చాయా?
-కొన్ని కథలు విన్నాను. సిగ్మా రిలీజ్ అయిన తర్వాత వాటి గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.