Skip to content

ఫిఫా వరల్డ్ కప్ 2026… ప్యానెల్ లిస్ట్ అలర్ట్

ఫిఫా వరల్డ్ కప్ 2026… ప్యానెల్ లిస్ట్ అలర్ట్ Telugu News

– ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం భారతదేశంలో ప్రధాన ప్లాట్‌ఫారమ్‌గా ZEE5..ఎక్స్‌ప‌ర్ట్‌ ప్యానెల్‌లో ఇండియ‌న్ ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా

ZEE5 తన ప్లాట్‌ఫారమ్‌లో చ‌క్క‌టి, ఉన్నతమైన నాణ్యతతో స్ట్రీమింగ్ చేస్తూ, లక్షలాది అభిమానులకు ఫిఫా ఫుట్ బాల్ మ్యాచ్‌ల‌ను చ‌క్క‌గా ఎంజాయ్ చేస్తూ, గొప్ప అనుభ‌వాన్ని అందించ‌టానికి సిద్ధ‌మైంది. ప్రేక్ష‌కుల‌ను చేరుకోవ‌టంలో ఉండే విస్తృత‌మైన అనుభ‌వం, అధునిక డిజిట‌ల్ సాంకేతిక‌తో జూన్ 11 నుంచి జీ5 లైవ్ మ్యాచ్‌లు, హైలైట్స్‌తో పాటు మ్యాచ్‌ల‌కు సంబంధించిన స్పెష‌ల్ కంటెంట్‌ను కూడా అందించ‌నుంది. దీంతో ప్రేక్ష‌కులు ప‌లు డివైజ్‌ల ద్వారా ఫుట్ బాల్ మ‌హోత్స‌వంలోని ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించ‌గ‌లుగుతారు. ఫిఫాతో ఏర్ప‌డిన ఈ భాగ‌స్వామ్యంతో జీ5 త‌న క్రీడా విభాగాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుచుకుంది. ఫిఫా టోర్నమెంట్స్‌లో ఉత్సాహానికి తగినట్లు ప్రేక్షకులకు ఆసక్తికరమైన, సులభంగా అందుబాటులో ఉండేలా తిరుగులేని వినోద అనుభవాన్ని అందించట‌మే జీ5 త‌న‌ లక్ష్యంగా పెట్టుకుంది.

2026 ఫిఫా అందించ‌నున్న ఈ గొప్ప‌ అనుభవాన్ని మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా జీ5 మ‌రో ఎన‌ర్జిటిక్ విష‌యాన్ని తెలియ‌జేసింది. అదేంటంటే… భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం ZEE5 నిపుణుల ప్యానెల్‌లో జాయిన్ అయ్యారు. భారతదేశంలో అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఒకరిగా భూటియా గుర్తింపు పొందిన సంగి తెలిసిందే. ఆయ‌న తన అద్భుతమైన కెరీర్, నాయకత్వం, భారత ఫుట్‌బాల్‌కు చేసిన సేవల ద్వారా ఫుట్ బాల్ క్రీడను దేశంలో ప్రజాదరణ పొందేలా చేయ‌టంలో కీలక పాత్ర పోషించారు. ఆయ‌న‌కు ఫుట్‌బాల్‌పై ఉన్న లోతైన అవగాహన, అపార‌మైన అనుభవం, టోర్నమెంట్‌పై మరింత లోతైన విశ్లేషణ అభిమానుల‌కు విలువైన మార్గ‌ద‌ర్శ‌కాలుగా నిల‌వ‌బోతోంది.

ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌లో భాగమవుతున్న సందర్భంగా భైచుంగ్ భూటియా మాట్లాడుతూ ‘‘భారతదేశంతో పాటు ప్రపంచలోని ఫుట్‌బాల్ అభిమానులకు ఫిఫా వరల్డ్ కప్ ప్రేరణ, ఆశయాలు, మరపురాని జ్ఞాపకాల వేదిక. ఇది కేవ‌లం ఆట మాత్ర‌మే కాదు.. దాన్ని మించింది. అభిరుచితో ప్రజలను ఒకటిగా కలిపే టోర్నమెంట్. జీ5, యునైట్ 8 స్పోర్ట్స్‌తో క‌లిసి ఎక్స్‌ప‌ర్ట్ ప్యానెల్‌లో భాగం కావ‌టం ఎంతో సంతోషంగా ఉంది. వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్ర‌త్యేకంగా చూపెట్టే క‌థ‌లు, పోటీ, ముఖ్య‌మైన క్ష‌ణాలను అభిమానుల‌కు తెలియ‌జేయ‌బోతున్న టీమ్‌లో నేను కూడా భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఫుట్ బాల్ ఆట‌కు భార‌త‌దేశంలో రోజురోజుకీ ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఫుట్‌బాల్ ఆట‌కు, అభిమానుల‌కు మ‌ధ్య ఉండే బంధాన్ని బ‌ల‌ప‌ర‌చ‌టానికి ఇదొక అద్భుత‌మైన అవ‌కాశం’’ అన్నారు.

See also  జూన్ 13న హైదరాబాద్‌లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్ మ్యాజికల్ అనుభూతిని అందించబోతోంది. ఎస్.ఎస్. తమన్

జూన్ 11 నుంచి ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026కి సంబంధించిన లైవ్ యాక్ష‌న్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా జీ5లోనే ఆస్వాదించండి.

– జీ5, యూనైట్ 8లో స్ట్రీమింగ్ కానున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 గురించి…

ఫిఫా వరల్డ్ కప్ 2026, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిఫా మధ్య 2034 వరకు కొనసాగనున్న ఒక కీలక దీర్ఘకాల భాగస్వామ్యానికి నాంది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను భారతదేశ ప్రేక్షకులు ఎంజాయ్ చేయ‌నున్నారు. జీ5, యూనైట్ 8 అనే రెండు ప్లాట్‌ఫారమ్‌లతో, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిఫా వరల్డ్ కప్ 2026కి సమగ్ర కవరేజ్‌ను అందించనుంది. ఇంగ్లీష్, హిందీ, బెంగాళీ, మలయాళం భాషల్లో ప్రసారం చేస్తూ, అభిమానులు తమకు ఇష్టమైన భాషలో టోర్నమెంట్‌లోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించే అనుభవాన్నిజీ 5 అందించనుంది.

ఈ భాగస్వామ్యం ఫిఫా నిర్వహించే ప్రధాన టోర్నమెంట్‌ల‌ను ఎక్కువ‌భాగం కవర్ చేస్తుంది. ఇందులో ఫిఫా వరల్డ్ కప్ 2030, ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027 వంటి ప్రముఖ అంతర్జాతీయ టోర్నమెంట్‌లు కూడా ఉండ‌బోతున్నాయి. ఉన్నతమైన స్ట్రీమింగ్ క్వాలిటీ, ప్రాంతీయ భాషల్లోని కంటెంట్‌తో పాటు ప్రేక్ష‌కుల ప్రత్యేక అనుభవాల ద్వారా జీ5, యునైట్ 8, ప్రపంచ ఫుట్‌బాల్‌ను భారతదేశంలోని లక్షలాది ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అదే సమయంలో దేశంలో ఫుట్‌బాల్‌కు పెరుగుతోన్న ఆద‌ర‌ణ‌కు ప్రాముఖ్య‌త ఇవ్వడంలో కూడా కీలక పాత్ర పోషించాలనుకుంటున్నాయి.

https://www.instagram.com/p/DZXz817BGuz

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.