Skip to content

బ్లాక్ బస్టర్ చిత్రాల్లో విలన్‌గా దూసుకుపోతోన్న విలక్షణ నటుడు సుదేవ్ నాయర్

మలయాళ నటుడు సుదేవ్ నాయర్ విలక్షణమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెరపై ఆయన పోషిస్తున్న పాత్రలు, చూపిస్తున్న విలనిజం, బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆయన పని తీరు అందరినీ మెప్పిస్తోంది. ఆయన కనిపిస్తున్న ప్రతీ సినిమా రీసెంట్‌గా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. గత ఏడాది వచ్చిన ‘ఓజీ’ చిత్రంలో సుదేవ్ నాయర్ పాత్రకు, ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో సుదేవ్ నాయర్ మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

చిరంజీవితో పాటుగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో అతని పాత్ర, నటించిన తీరు తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాయర్ సంక్లిష్టమైన పాత్రని, డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రని పోషించారు. సుదేవ్ నాయర్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలిగిన సుదేవ్ నాయర్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టుగా అతని బాడీ కండలు, అథ్లెటిక్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే సుదేవ్ తెలుగు మాస్ ఆడియెన్స్‌కి దగ్గరవుతున్నాడు. ఇక త్వరలోనే తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని సుదేవ్ ఆశిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులన్నా, తెలుగు సినిమాలన్నా ఎంత అభిమానమో ఈ నిబద్దతే సూచిస్తుంది. ఇక త్వరలోనే తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెబుతారేమో చూడాలి.

ప్రస్తుతం యష్‌తో ‘టాక్సిక్ – ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్‌’లో ప్రధాన పాత్రను నాయర్‌ పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చిలో ఆడియెన్స్ ముందుకు రానుంది. ‘టాక్సిక్’ తరువాత సుదేవ్ నాయర్ పేరు నేషనల్ వైడ్‌గా మరింత ట్రెండ్ కానుందని అర్థం అవుతోంది. మున్ముందు సుదేవ్ నాయర్ మన తెలుగు మేకర్లు ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తాడనిపిస్తోంది.