20 కోట్ల భారీ బడ్జెట్‌తో హై-వోల్టేజ్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్న నాగబంధం టీం
యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నాగబంధంతో అలరించబోతున్నారు. నాగబంధం డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యసీవ్ సినిమాటిక్ వండర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం టీం నానక్‌రామగూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్‌బంప్స్ పుట్టించే క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా…
