జనవరి 30న థియేటర్స్‌లో ‘గాంధీ టాక్స్’ సందడి
* ‘గాంధీ టాక్స్’ టీజర్.. శబ్దంతో నిండిన సినిమా ప్రపంచంలో సైలెంట్ ఫిల్మ్‌తో నిశ్శబ్దాన్ని ఆవిష్కరించనున్న జీ స్టూడియోస్ స్టోరీ టెల్లింగ్‌లో శబ్దంతో నిండిన సినిమా ప్రపంచంలోకి సైలెంట్ ఫిల్మ్‌గా రూపొందిన ‘గాంధీ టాక్స్’ టీజర్ వచ్చేసింది. ఇది నిశ్శబ్దంగానే కాదు.. ధైర్యంగా చేసిన ఓ ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా, దృష్టిని మరల్చనీయకుండా, మాటలతో పని లేకుండా రా ఎమోషన్స్‌తో, కట్టిపడేసే దృశ్యాలతో, భావోద్వేగ ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను ఇది ఆహ్వానిస్తోంది. ఒక డైలాగ్ కూడా లేకుండా రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకుల మనసుల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.ఉద్వేగ భరితమైన నిశ్శబ్దంతో కూడిన ఈ ఇంటెన్స్ విజువల్స్ మనసుల్లో ఓ సంఘర్షణను, అశాంతి, మార్పును సూచిస్తూ.. గాంధీ నిజంగా ఏదో చెప్పబోతున్నాడనే ఆసక్తిని…
