Skip to content

‘హ్యాపీ రాజ్’ మార్చి 27న గ్రాండ్ రిలీజ్

‘హ్యాపీ రాజ్’ మార్చి 27న గ్రాండ్ రిలీజ్ Telugu News
‘హ్యాపీ రాజ్’ మార్చి 27న గ్రాండ్ రిలీజ్ Telugu News

భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు.
మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ప్రమోషనల్ మెటీరియల్‌కు మంచి ఆదరణ లభించింది. కలర్, యాటిట్యూడ్, మాస్ టోన్‌తో అద్భుతమైన ఫస్ట్-లుక్ పోస్టర్‌తో తెలుగు ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి.
జివి ప్రకాష్ కుమార్ కాన్ఫిడెంట్ గా – నల్లటి సూట్, ఓపెన్-కాలర్ షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి, స్ట్రీట్ -స్మార్ట్ గా ఆటో రిక్షా నుండి బయటకు వస్తున్న ఫస్ట్ లుక్ స్టైలిష్‌గా అందరిదృష్టిని ఆకర్షించింది.
ఈ చిత్రంలో అబ్బాస్, జార్జ్ , గీతా కైలాసం, ప్రార్థన నాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హ్యాపీ రాజ్ రిఫ్రెషింగ్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మధన్ క్రిస్టోఫర్, మ్యూజిక్ జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్ ఆర్కె సెల్వ, ప్రొడక్షన్ డిజైనర్ కుమార్ గంగప్పన్
హ్యాపీ రాజ్ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సపోర్ట్ తో ఈ చిత్రం తెలుగులో స్ట్రాంగ్ రన్ అందుకోనుంది.
తారాగణం: జివి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ, అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్, అదుర్చి అరుణ్, మధురై ముత్తు, దేవి మహేష్, సోఫాబాయ్ రసూల్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం- మరియా రాజా ఎలాంచెజియన్
నిర్మాత- జైవర్ద
సహ నిర్మాత – జైకాంత్ సురేష్
తెలుగు రిలీజ్: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP
డీవోపీ-మధన్ క్రిస్టోఫర్
ఎడిటర్- ఆర్కే సెల్వ
సంగీతం- జస్టిన్ ప్రభాకరన్
ప్రొడక్షన్ డిజైనర్ – కుమార్ గంగప్పన్
కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రవీణ్ రాజా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- విశ్రేత్ కెఎల్
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.