ఈ నెల 25న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాట విడుదల
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. 'గురుతుందా...' పాటతో "చెన్నై లవ్ స్టోరీ" మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్…
