హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్…
సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమా
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు “చెన్నై లవ్ స్టోరీ” మూవీ రెడీ అవుతోంది.
తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ దక్కింది. ఇటీవల వచ్చిన ప్రేమ కథల్లో ఈ సినిమా విభిన్నంగా ఉందని కుటుంబం అంతా చూడగలిగే ఇలాంటి మంచి ప్రేమ కథలు మరిన్ని రావాలని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. మరోవైపు “చెన్నై లవ్ స్టోరీ” మేకర్స్ అగ్రిసెవ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. “చెన్నై లవ్ స్టోరీ” సినిమాను ఈ నెల 23న ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ లో ఎంజాయ్ చేసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, సిరి హన్మంతు, మహేందర్, నరేష్, పూజ, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

