సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్…
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’

బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతంలో బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) కైవసం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత సోనీ లివ్ (Sony LIV)లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కానుంది.
జూలై 24న థియేటర్లలో విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈ సీజన్‌లో భారీ బాక్సాఫీస్ హిట్‌లలో ఒకటిగా నిలిచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకుంటోంది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియల ఫ్రెష్ పెయిరింగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తోంది. వారిద్దరి సహజమైన నటన, అద్భుతమైన కెమిస్ట్రీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
తొలిప్రేమలోని ఉత్సాహం, సంక్లిష్టతలు, ఎత్తుపల్లాలు, భావోద్వేగాల మధ్య ఇద్దరు యువతీయువకుల ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. వాస్తవిక అనుభవాలు, హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్‌ను జోడించి తొలిప్రేమలోని మాధుర్యాన్ని ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో వెండితెరపై చాలా అందంగా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించారు.
ఈ డిజిటల్, శాటిలైట్ భాగస్వామ్యం గురించి నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) మాట్లాడుతూ.. “థియేటర్లలో ‘చెన్నై లవ్ స్టోరీ’కి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాకు, అందులోని పాత్రలకు ప్రేక్షకులు ఇంతలా కనెక్ట్ కావడం మాకు అత్యంత సంతృప్తినిచ్చింది. ఈ చిత్రాన్ని మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు SPNI తో డిజిటల్, శాటిలైట్ ప్రీమియర్ల కోసం భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దక్షిణాది నుంచి అద్భుతమైన కథలను తీసుకురావడంలో సోనీ లివ్ బలమైన గుర్తింపు తెచ్చుకుంది. వారి కంటెంట్ జాబితాలో మా ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా భాగం కావడం ఎంతో ఉత్సాహంగా ఉంది” అని అన్నారు.
ఈ సినిమాకు సాయి రాజేష్ నీలం కథ అందించగా.. రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరించారు. అతిత్వరలో ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ ప్రీమియర్ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.

