‘సీతా పయనం’ని ఎంతో నిజాయితీతో తీశాం.. థాంక్స్ మీట్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ని తెరకు పరిచయం చేశారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆడియెన్స్, మీడియా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ కథ గ్రాటిట్యూడ్, థ్యాంకింగ్‌కి సంబంధించింది. మా సినిమాకి ప్రేమను, ప్రశంసల్ని కురిపించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో తోడుగా…
