అల్లు ఎంటర్టైన్మెంట్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం
మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం.. మీడియా మీట్లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌కు ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. నగరంలో తొలి డాల్బీ సినిమా వచ్చింది. హైదరాబాద్‌లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్‌ను ప్రారంభించినట్లు అల్లు ఎంటర్టైన్మెంట్ గర్వంగా ప్రకటించింది. ఇకపై ల్యాండ్‌మార్క్ వినోద గమ్యస్థానంగా అల్లు సినిమాస్ మారనుంది. హైదరాబాద్‌ను అల్లు సినిమాస్ వరల్డ్ సినిమా మ్యాప్‌లో సరికొత్త స్థాయిలోని నిలబెడుతుంది. హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్లలో…
