‘అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ సాంగ్ రిలీజ్
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను, పాటల్ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘ఎలగే పిల్ల’ అనే పాటను రిలీజ్ చేసి, చిత్రయూనిట్‌కు అభినందనలు…
