Skip to content

జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న “బేబి” మూవీ టీమ్ ను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో "బేబి" సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్‌ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందిస్తామ‌ని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్…

Read more

నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం – “బేబి” మూవీ టీమ్

ప్రతిష్టాత్మక 71 జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో "బేబి" మూవీ టీమ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ - "బేబి" సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం సంతోషంగా ఉంది. సాయి రాజేశ్ గారికి వరుసగా రెండోసారి జాతీయ పురస్కారం వచ్చింది. రోహిత్, సాయి రాజేశ్ గారికి కంగ్రాట్స్…

Read more

జాతీయ అవార్డ్స్ లో సత్తాచాటిన “బేబి” మూవీ. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్, ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకున్న కల్ట్ బ్లాక్ బస్టర్

నేడు ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా సత్తాచాటింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. "బేబి" సినిమాకు సాయి రాజేశ్ రాసిన హృద్యమైన కథనం జాతీయ స్థాయిలో పురస్కారం సాధించింది. అలాగే ఈ చిత్రంలో ప్రేమిస్తున్నా అనే పాటను మనసుకు హత్తుకునేలా పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ ప్రతిభను నేషనల్ అవార్డ్ వరించింది. "బేబి" సినిమాకు సైమా, గామా, ఫిలింఫేర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కగా...ఈ రోజు ప్రకటించిన రెండు జాతీయ అవార్డ్స్ అత్యున్నత గౌరవాన్ని అందించాయి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి…

Read more