Skip to content

ఆనంద్ దేవరకొండ ఇంటెన్స్ యాక్షన్ మూవీ “తక్షకుడు”

ఆనంద్ దేవరకొండ ఇంటెన్స్ యాక్షన్ మూవీ “తక్షకుడు” Telugu News

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన సినిమా “తక్షకుడు”. ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు వినోద్ అనంతోజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబోలో వచ్చిన “మిడిల్ క్లాస్ మెలొడీస్” సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో “తక్షకుడు” సినిమా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని నాగవంశీ.ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

“తక్షకుడు” సినిమాలో నితాన్షీ గోయెల్ నాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఈ రోజు నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ‘ వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు..’ అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది. హీరో ఆనంద్ దేవరకొండ చేతిలో తుపాకీ పట్టుకుని ఉండటం, ఒక ఊరు అగ్నికి ఆహుతి అవుతున్నట్లు డిజైన్ చేసిన పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఆనంద్ దేవరకొండ కెరీర్ లో ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ కానుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.