Skip to content

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – వీఎన్ ఆదిత్య

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – వీఎన్ ఆదిత్య Telugu News

‘మన డాక్టర్ బాబే’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఉంటుంది – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ స్కంద

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు టీజర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. ఇలాంటి మంచి కామెడీ సినిమాలు రావాలి. టైటిల్‌లో డాక్టర్, మన అని పదాలు అంటే కచ్చితంగా హిట్ అవుతుంటాయి. ఇలాంటి ప్రాజెక్టులకు తోడుగా నిలబడిన అలీ గారు, రాజీవ్ కనకాల గారికి థాంక్స్. ఏవీఎస్ గారి కూతురు శాంతి గారు మళ్లీ కం బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

శ్రీ స్కంద మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీలోని ప్రతీ ఒక్కరూ మన సినిమా అని అనుకుని ఎంతో సపోర్ట్ చేశారు. చలపతి గారు అన్నీ తానై చేశారు. అన్ని బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. ఇది చాలా మంచి కథ. ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌ను జాగ్రత్తగా తెరకెక్కించాం. టీజర్ చూసి కేవలం యూత్ సినిమా అని అనుకోకండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. క్లైమాక్స్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఈవీవీ గారు, జంధ్యాల గారి సినిమాల్ని చూసినట్టుగా ఉంటుంది. ఈ మూవీకి హీరో కథ. నేను ఓ ఆర్టిస్ట్‌ని మాత్రమే. ప్రతీ ఫ్యామిలీ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ఈ చిత్రాన్ని చూశాను. మంచి సినిమా చేశాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నా మొదటి సినిమాలోనే అలీ గారు, రాజీవ్ కనకాల గారు, శాంతి గారు, కోటేశ్వరరావు వంటి గొప్ప వారితో నటించే అవకాశం లభించింది. కెమెరామెన్ కిషోర్ గారు నిజంగా అద్భుతం చేశారు. మా రైటర్ ఆర్కే గారు మంచి కథ, డైలాగ్స్ అందించారు. మనోజ్ గారి మ్యూజిక్ అందరినీ కదిలిస్తుంది’ అని అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ సినిమాలో స్కంద చాలా చక్కగా నటించారు. చలపతి అందరి నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ బ్యానర్‌కు మంచి సక్సెస్ రావాలి. కొత్తగా వచ్చే వారికి హిట్లు వస్తే.. మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తుంటారు. ఓ సినిమా వల్ల ఎన్నో కుటుంబాలు బతుకుతుంటాయి. చిన్న సినిమాల్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు చలపతి కుమార్ మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్‌ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. వీఎన్ ఆదిత్య గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ప్రభు గారు, సురేష్ గారు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తుంటారు. స్కంద గారి వల్లే ఈ సినిమా మొదలైంది. ఆయన్ను చూసిన రోజే మంచి హీరో అవుతారని అనుకున్నాను. స్కంద గారు, కృతాక్షి గారు నిర్మాతలుగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆర్కే రైటర్ ఈ కథను చాలా బాగా డెవలప్ చేశారు. ప్రతీ సీన్‌కు ఆడియెన్స్ కచ్చితంగా నవ్వుతారు. ఇలాంటి కాన్సెప్ట్‌‌కి ఓ చిన్న లేయర్ ఉంటుంది. ఆ లేయర్‌ను దాటలేదు. ఫక్తు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది. చివరకు థియేటర్ నుంచి కన్నీటి చెమ్మతో బయటకు వెళ్తారు. మా మూవీకి మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలుగుతుంది. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అలీ గారు, రాజీవ్ కనకాల, ఇతర ఆర్టిస్టులందరికీ థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత కృతాక్షి మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమాకి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

విశ్వ కార్తికేయ మాట్లాడుతూ .. ‘‘చలపతి గారు నన్ను సోలో హీరోగా లాంచ్ చేశారు. ‘మన డాక్టర్ బాబే’ కథ నాకు తెలుసు. ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఈ మూవీ వంద శాతం పెద్ద హిట్ అవ్వాలి. ఆ తరువాత చలపతి, నేను చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

నటుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చాలా గ్యాప్ తరువాత ఓ మంచి పాత్రను చేశానని నాకు అనిపిస్తోంది. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నటి శాంతి మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ చిత్రం ఆద్యంతం నవ్విస్తూ ఉంటుంది. నా పాత్ర కాస్త సీరియస్‌గా ఉంటుంది. సెన్సిటివ్ టాపిక్‌ను చలపతి గారు ఎంతో చక్కగా హ్యాండిల్ చేశారు’ అని అన్నారు.

శ్రుతి శంకర్ మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చిన చలపతి గారికి థాంక్స్. మీడియా, ఆడియెన్స్ మా మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మోహన సిద్ధి మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్‌ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రస్తుతం ఇలాంటి చిత్రాలు రావడం తగ్గిపోయాయి. కథ చెప్పిన వెంటనే నాకెంతో నచ్చింది. ప్రతీ పాత్ర నవ్విస్తుంది. అందరూ అద్భుతంగా నటించారు. ఇది పక్కా మ్యూజికల్ హిట్’ అని అన్నారు.

బూసం మనోజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ చిత్రంలో అవకాశం ఇచ్చిన చలపతి గారు, నిర్మాత కృతాక్షి గారు, స్కంద గారికి థాంక్స్. ఎంతో సరదాగా మ్యూజిక్ కంపోజ్ చేశాం. అన్ని పాటలు బాగుంటాయ’ని అన్నారు.

కెమెరామెన్ కిషోర్ బోయిడపు మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ సినిమాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

రామకృష్ణ మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. చలపతి గారు, కిషోర్ గారి కాంబో బాగా సెట్ అయింది. అందుకే త్వరగా షూటింగ్ ఫినిష్ చేయగలిగామ’ని అన్నారు.

లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ .. ‘చలపతి గారికి నేను రెగ్యులర్‌గా పాటలు రాస్తుంటాను. చలపతి పువ్వల ఈ సినిమా తరువాత చలపతి నవ్వుల అవుతారు. శ్రీ స్కందలో ఎంతో ఈజ్ ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.

నటుడు శివ కుమార్ మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కొత్త సినిమాల్ని తెలుగు ప్రజలెప్పుడూ ఆదరిస్తుంటారు. అలానే మా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘‘చలపతి గారు మంచి అనుభవంతో ‘మన డాక్టర్ బాబే’ అనే మంచి టైటిల్‌ను పెట్టారు. టీజర్ బాగుంది. థియేటర్‌లకు ఆడియెన్స్‌ని రప్పించేలా టీజర్‌ను కట్ చేయడం ఆనందంగా ఉంది. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టైటిల్ చాలా బాగుంది. టైటిల్‌లో డాక్టర్ అని ఉంటే దాదాపు ఆ సినిమా హిట్ అవుతుంది. టీజర్‌ను చూస్తుంటే ఆద్యంతం వినోదాత్మకంగా అనిపిస్తోంది’ అని అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.