‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – వీఎన్ ఆదిత్య
‘మన డాక్టర్ బాబే’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఉంటుంది - టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ స్కంద శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు టీజర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. ఇలాంటి మంచి కామెడీ సినిమాలు…
