Skip to content
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి మెలోడీయస్ ‘ప్రియసఖి’ విడుదల Telugu News

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి మెలోడీయస్ ‘ప్రియసఖి’ విడుదల

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్ర బృందం తాజాగా రెండవ గీతం ‘ప్రియసఖి’ని విడుదల చేసింది. ఈ పాట తన భావోద్వేగ లోతు, హాయినిచ్చే అనుభూతితో ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ప్రేమ అనే భావన చుట్టూ అల్లుకున్న ఈ పాట, ఒక యువకుడు తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి పట్ల మనసులో దాచుకున్న మౌన భావాలను, ఆరాధనను, అనురాగాన్ని అందంగా ఆవిష్కరించింది. గేయ రచయిత సురేష్ బనిశెట్టి అందించిన సాహిత్యం సరళంగా ఉంటూనే, హృదయానికి హత్తుకునేలా ఉంది. ప్రతి పదం పాట భావానికి అద్భుతంగా సరిపోతూ, శ్రోతలను తక్షణమే ఆకట్టుకుంటుంది. ఈ స్వరకల్పనకు ప్రాణం పోస్తూ, గాయకుడు కె.ఎస్. హరిశంకర్ తన మృదువైన, భావయుక్తమైన గాత్రంతో మంత్రముగ్ధులను చేశారు. సంగీత దర్శకుడు…

Read more
ఘనంగా ‘ఎపిక్‌’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ Telugu News

ఘనంగా ‘ఎపిక్‌’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌

'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'సంచారమే' అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. 'ఎపిక్' టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. 90’s వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న…

Read more
ఆనంద్ దేవరకొండ నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ Telugu News

ఆనంద్ దేవరకొండ నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్

*- ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ఆనంద్ దేవరకొండ* మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటిస్తూ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. తనదైన తరహా చిత్రాల్లో నటిస్తున్న ఆనంద్ కు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రోజు ఆయన తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ వంటి సినిమాలు ఆనంద్ స్క్రిప్ట్ సెలెక్షన్ కు నిదర్శనంగా నిలుస్తాయి. బేబి మూవీ ఆనంద్ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి సక్సెస్ అందించింది. వంద కోట్ల గ్రాసర్ గా కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆనంద్ దేవరకొండను ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చింది. వేగంగా సినిమాలు చేయడం కంటే క్వాలిటీగా…

Read more
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.32 టైటిల్ గ్లింప్స్‌ విడుదల Telugu News

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.32 టైటిల్ గ్లింప్స్‌ విడుదల

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఖరారు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. '90s' వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ…

Read more
ఆనంద్ దేవరకొండ ఇంటెన్స్ యాక్షన్ మూవీ “తక్షకుడు” Telugu News

ఆనంద్ దేవరకొండ ఇంటెన్స్ యాక్షన్ మూవీ “తక్షకుడు”

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన సినిమా "తక్షకుడు". ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు వినోద్ అనంతోజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబోలో వచ్చిన "మిడిల్ క్లాస్ మెలొడీస్" సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో "తక్షకుడు" సినిమా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని నాగవంశీ.ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. "తక్షకుడు" సినిమాలో నితాన్షీ గోయెల్ నాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఈ రోజు నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ' వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు..' అనే…

Read more
జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న “బేబి” మూవీ టీమ్ ను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telugu News

జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న “బేబి” మూవీ టీమ్ ను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో "బేబి" సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్‌ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందిస్తామ‌ని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్…

Read more
నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం – “బేబి” మూవీ టీమ్ Telugu News

నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం – “బేబి” మూవీ టీమ్

ప్రతిష్టాత్మక 71 జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో "బేబి" మూవీ టీమ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ - "బేబి" సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం సంతోషంగా ఉంది. సాయి రాజేశ్ గారికి వరుసగా రెండోసారి జాతీయ పురస్కారం వచ్చింది. రోహిత్, సాయి రాజేశ్ గారికి కంగ్రాట్స్…

Read more
జాతీయ అవార్డ్స్ లో సత్తాచాటిన “బేబి” మూవీ.  ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్, ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకున్న కల్ట్ బ్లాక్ బస్టర్ Telugu News

జాతీయ అవార్డ్స్ లో సత్తాచాటిన “బేబి” మూవీ. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్, ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకున్న కల్ట్ బ్లాక్ బస్టర్

నేడు ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా సత్తాచాటింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. "బేబి" సినిమాకు సాయి రాజేశ్ రాసిన హృద్యమైన కథనం జాతీయ స్థాయిలో పురస్కారం సాధించింది. అలాగే ఈ చిత్రంలో ప్రేమిస్తున్నా అనే పాటను మనసుకు హత్తుకునేలా పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ ప్రతిభను నేషనల్ అవార్డ్ వరించింది. "బేబి" సినిమాకు సైమా, గామా, ఫిలింఫేర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కగా...ఈ రోజు ప్రకటించిన రెండు జాతీయ అవార్డ్స్ అత్యున్నత గౌరవాన్ని అందించాయి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి…

Read more