Skip to content

చంద్రబోస్‌ సోదరుడు రాజేంద్ర హఠాన్మరణం

చంద్రబోస్‌ సోదరుడు రాజేంద్ర హఠాన్మరణం Telugu News

కలికిరి టౌన్: 03మే2026: కలికిరి మండలం కలికిరి పట్టణంలోని క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని స్టేట్ బ్యాంక్ ముందు హైదరాబాద్ నగరం, డాలర్ డ్రీమ్స్ కాలనీ, ప్రగతి నగర్ కు చెందిన నరసయ్య కుమారుడు తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ కె.రాజేంద్ర (60)ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఇతను గుండ్లూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి మంచి స్నేహితుడు. ఇతను వారం రోజుల క్రితం కలికిరికి స్నేహితుని రూముకు వచ్చి ఉన్నాడు. అయితే శ్రీనివాసరెడ్డి ఒక రోజు ముందు హైదరాబాద్ కు వెళ్ళిపోగా రాజేంద్ర అతని రూమ్ లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం గుండె పోటు రావడంతో శ్రీనివాసులు రెడ్డి సూచనలతో ఆస్పత్రిలో ఈసీజీ తీసుకుందామని క్రాస్ రోడ్ స్టేట్ బ్యాంకు సమీపంలో ఓ హోటల్లో టిఫిన్ చేసి బయటకు రాగా గుండెపోటు తీవ్రమై అక్కడికక్కడే క్రింద పడి మృతి చెందాడు. స్థానికులు అతని వద్ద ఉన్న ఫోన్ ద్వారా సమాచారాన్ని వారి స్నేహితునికి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడు రాజేంద్ర భార్య వసంత తెలంగాణ ఆర్టీసీ లోనే కండక్టర్ గా పని చేస్తుంది.అయితే ఇతను ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్ సోదరుడు అని తెలుస్తోంది. కలికిరి పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి పీఎం గదికి తరలించారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.