ఆలియా భట్ ప్రధాన పాత్రధారిగా.. శర్వారి కీలక పాత్రలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య…
“ఆపరేషన్ అరుణారెడ్డి” టీజర్ విడుదల
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆపరేషన్ అరుణారెడ్డి” టీజర్‌ను ఈరోజు (జూన్ 17, 2026) ఉదయం 11:14 గంటలకు చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, ఇప్పుడు విడుదలైన టీజర్‌తో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. సమాజంలోని కీలక అంశాలను స్పృశిస్తూ, వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో హిందోళ చక్రవర్తి, ఆయేషా భాను, కాజల్ కథానాయికలుగా నటించగా, సుధాకర్ అక్కినపల్లి ఛాయాగ్రహణం అందించారు. మహవీర్ సంగీతం సమకూర్చారు.
టీజర్ విడుదల సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, “ఆపరేషన్ అరుణారెడ్డి” ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రమని, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపింది. త్వరలోనే సినిమా విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది.
విడుదలైన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
చిత్రం: ఆపరేషన్ అరుణారెడ్డి
నటుడు – దర్శకుడు: పోసాని కృష్ణమురళి
హీరోయిన్స్: హిందోళ చక్రవర్తి, ఆయేషా భాను, కాజల్
ఛాయాగ్రహణం (DOP): సుధాకర్ అక్కినపల్లి
సంగీతం: మహవీర్

