‘ప్రేమంటే’ కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్. హీరో ప్రియదర్శి
ప్రియదర్శి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రేమంటే. ఆనంది హీరోయిన్ గా నటించింది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై నిర్మించిన చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేసింది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో ప్రియదర్శి…
