Skip to content

‘ప్రేమంటే’ కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్. హీరో ప్రియదర్శి

‘ప్రేమంటే’ కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్.     హీరో ప్రియదర్శి Telugu News

ప్రియదర్శి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రేమంటే. ఆనంది హీరోయిన్ గా నటించింది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై నిర్మించిన చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేసింది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇంత మంచి సూపర్ హిట్ సినిమా ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్. మా నిర్మాతలకు డైరెక్టర్ గారికి టీం అందరికి థాంక్యూ. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని మీ అందరూ అప్రిషియేట్ చేస్తున్నందుకు థాంక్యూ వెరీ మచ్. ఆడియన్స్ సినిమా చూసి హ్యాపీగా నవ్వుకుంటూ బయటికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్లీన్ ఎంటర్టైన్మెంట్ ని మీరందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ అదిరిపోయింది. ప్రతి చోట ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ కావాలనేది నా డ్రీమ్. అది ఈరోజు తీరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ చాలా క్లీన్ సినిమా అనే ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఫ్యామిలీ, యూత్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రియదర్శిగారు ఆనంద్ గారి పర్ఫామెన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మీరందరూ కూడా సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

ఆనంది మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా ధియేటర్లో అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఉంది. సినిమా అయిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టారు. అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తున్నారు. మా పర్ఫార్మెన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైంది. అందరు కూడా అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ అందరూ ఈ వీకెండ్ సినిమా థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ జాన్వి నారంగ్ మాట్లాడుతూ. అందరికి నమస్కారం. ప్రేక్షకులందరూ కూడా సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ వెళ్లారు. ఎంతో ప్రేమని ఇచ్చారు. అందరూ కూడా సూపర్ మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఒక నిర్మాతగా చాలా ఆనందంగా ఉన్నాను. మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. సినిమా కలెక్షన్స్ రేపట్నుంచి ఇంకా అద్భుతంగా ఉండబోతున్నాయి. అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి వచ్చి ఈ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.