Skip to content

‘పురుషః’ నుంచి ‘దేవనాయకి’ సాంగ్‌ రిలీజ్‌

‘పురుషః’ నుంచి  ‘దేవనాయకి’  సాంగ్‌ రిలీజ్‌ Telugu News

డిఫరెంట్ ప్రమోషన్స్‌తో ‘పురుష:’ చిత్రయూనిట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాని నిర్మించారు. పక్కా ఫ్యామిలీ కథ, భార్యాభర్తల చిలిపి తగాదాలతో ఎంటర్టైన్ చేయడానికి ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ‘పురుష:’ మూవీ రాబోతోంది. వీరు వులవల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కానున్నారు. హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రల్ని పోషించారు.

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌లో బజ్‌ను, హైప్‌ను క్రియేట్ చేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘దేవ నాయకి’ అంటూ సాగే మంచి ఎనర్జిటిక్ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ మంచి పెప్పీ ట్యూన్‌ను అందించారు. సాహితి చాగంటి గాత్రం ఈ పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ పాటకు భాను మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు, అమైరా దస్తూర్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఇలస పులస ఎలా అయిందో తెలియాలంటే ఈ పాటను వినాల్సిందే, చూడాల్సిందే.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమాకు కామెరామెన్ గా సతీష్ ముత్యాల, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి పని చేశారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు.

See also  'చాయ్ షాట్స్' కంటెంట్, క్రియేటర్స్ సినిమాస్ లానే పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాను: రానా దగ్గుపాటి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.