Skip to content

“బాపు బొమ్మ – విశ్వ మహిళ” అవార్డ్స్ ప్రదానోత్సవం

తొలి పురస్కార గ్రహీత మెగా మాతృమూర్తి శ్రీమతి కొణిదెల అంజనీదేవి బాపుబొమ్మగా తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుని, సామాజిక - రాజకీయ రంగాల్లోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్న ప్రముఖ నటీమణి దివ్యవాణి చౌదరి... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని "బాపు బొమ్మ - విశ్వ మహిళ" పేరిట 2026 వ సంవత్సరానికిగాను అవార్డ్స్ ప్రదానం చేశారు!! మెగా బాపు బొమ్మ శ్రీమతి కొణిదెల అంజనీదేవి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యు.ఎస్.ఎ), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యు.ఎస్.ఎ) తదితర ప్రముఖ మహిళామణులు పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు!! తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు…

Read more

“మిరాకిల్” నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్”

-క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ దర్శకుడిగా ప్రభాస్ నిమ్మల పేరు మారుమ్రోగేలా చేసే చిత్రం మిరాకిల్ *-మల్టీ టాలెంటెడ్ హీరో శ్రీరామ్* కొండమడుగు ప్రజలకు జీవితాంతం కృతజ్ఞడునై ఉంటాను. ఇప్పటివరకు భారతీయ తెరపై ఆవిష్కారం కాని వినూత్న కథా చిత్రం "మిరాకిల్" *-దర్శకుడు ప్రభాస్ నిమ్మల* "కుమారి 21ఎఫ్, ఈడో రకం - ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్" వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్ లో ఎన్నో ఉన్నప్పటికీ... తాజాగా నేను చేస్తున్న "మిరాకిల్" నా కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. థాంక్స్ టు డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల" అని అన్నారు క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్. సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి…

Read more

*అరుణాచల గిరి ప్రదక్షిణ” ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి

"ఆటగదరా శివా" అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు - రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి... సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "అరుణాచల గిరి ప్రదక్షిణ" చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ లో సిద్ధహస్తుడైన యువ ప్రతిభాశాలి హర్ష. ఎం. దర్శకత్వం వహిస్తుండగా... సంగీతద్వయం డా. ఎ. జె. సంధ్యవర్షిణి - డా.వి.ఆర్.ఎ. ప్రదీప్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కోసం స్వరపరిచిన ఓ గీతానికి చింతల శ్రీనివాస్ సాహిత్యం సమకూర్చగా... మధు గాత్రం అందించారు. మదర్ సెంటిమెంట్ తోపాటు బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న "అరుణాచల గిరి ప్రదక్షిణ" అద్భుత విజయం…

Read more

“మిరాకిల్” చేద్దాం రండి అంటున్న హెబ్బా పటేల్

సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రల్లో..... ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్'గా తెరకెక్కుతున్న "మిరాకిల్" షూట్ లో జాయిన్ అవుతున్న హెబ్బా పటేల్!! సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ "మిరాకిల్". "సత్య గ్యాంగ్, ఫైటర్ శివ" చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్... ఈనెల 24 (ఫిబ్రవరి 24) నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనున్న మూడో షెడ్యూల్ లో సెట్స్ లో జాయిన్ కానుంది!! రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న…

Read more

అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” పాటల రికార్డింగ్ పూర్తి

సంగీత సంచలనం సాయి కార్తీక్ స్వర సారధ్యంలో చిత్ర దర్శకుడు శివాల ప్రభాకర్ సింగిల్ కార్డు సాహిత్యం!! జి.ఎస్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి.శైలజా రెడ్డి నిర్మిస్తున్న ముక్కోణపు ప్రేమకథాచిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వినూత్న ప్రేమ కథాచిత్రం షూటింగ్ కి ముందే పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుని సంగీత సౌరభాలు వెదజల్లుతోంది. పవన్ మహావీర్ సరసన సుహాన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని మరో హీరోయిన్ ను త్వరలో రివీల్ చేస్తారు!! ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ స్వర సారధ్యంలో... దర్శకుడు శివాల ప్రభాకర్ సమకూర్చిన సాహిత్యానికి సుప్రసిద్ధ…

Read more

విజయ్ యర్రంశెట్టి “శివోహం” షూటింగ్ పూర్తి!!

జెసి ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం శివోహం. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఇ. వి. ప్రసాద్, శిరీష, శ్రీలత, రాణి, జి వి వి. సిద్దు, బి శివశంకర్, మునేష్, స్వాతి, మురళీధర్, పుల్లయ్య, మనీషా, గ్లామర్ బాయ్ విశ్వనాధ్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. మహాశివరాత్రి సందర్భంగా విలన్ లుక్ పోస్టర్ని లాంచ్ చేసింది చిత్ర బృందం. అతి త్వరలో తెలుగు హిందీ భాషల్లో ఈ చిత్రం థియేటర్లో సందడి చేయనుంది. సతీష్ పిల్లి ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ చిత్రానికి స్టోరీ…

Read more

బరాబర్ బాధపడుతున్నాను!! – జె. డి. చక్రవర్తి

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన మాట్లాడుతూ... "సినిమాలకు ప్రచారం కల్పించేందుకు ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇటీవల నేను అతిధిగా పాల్గొన్న ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో... ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయాను. మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నాను. సృజనాత్మకతమైన ఆలోచనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలే తప్ప, రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష, "భాష"లతో కాదని నేను బలంగా నమ్ముతాను" అని జె.డి.చక్రవర్తి అన్నారు. ఈమేరకు ఆయన ఒక వీడియో సైతం విడుదల చేశారు!!

Read more

ఈటీవీ విన్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్న ముళ్ళపూడి వరా “గొల్ల రామవ్వ”

స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన రోమాంఛిత వీరగాథ "గొల్ల రామవ్వ"కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జనవరి 25 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ - వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై... రామ్ విశ్వాస్ హనూర్కర్ - రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు... సాహిత్యం సమకూర్చారు. ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం "మౌనమే నీ భాష" చిత్రాన్ని నిర్మించి, వీక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన టీమ్ నుంచి వచ్చిన…

Read more

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రరాజం “గొల్ల రామవ్వ”: ఈనెల 25 నుంచి ఈటీవీ విన్’లో!!

తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన "గొల్ల రామవ్వ" తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని... ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ముఖ్య అతిధులు పేర్కొన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను... సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ - వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై... రామ్ విశ్వాస్ హనూర్కర్ - రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. యువ ప్రతిభాశాలి అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు... సాహిత్యం సమకూర్చడం విశేషం!! ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం "మౌనమే నీ భాష" చిత్రాన్ని నిర్మించి, వీక్షకుల నుంచి విశేష ఆదరణ…

Read more

రమేష్ వర్మ ప్రోత్సాహంతో “కొక్కొరోకో” అంటున్న మనస్విని బాలబొమ్మల

ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం “కొక్కొరోకో” షూటింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. నీలాద్రి ప్రొడక్షన్ సమర్పణలో, RV ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. సంప్రదాయ కోడిపందాల నేపథ్యం చుట్టూ తిరిగే కథతో, ఐదు విభిన్న పాత్రలతో రూపొందిన అంథాలజీ చిత్రంగా “కొక్కొరోకో” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లేను రమేష్ వర్మ అందించగా, బలమైన విజువల్స్‌తో పాటు భావోద్వేగాత్మక కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 2026లో విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మరో ముఖ్య విశేషం ఏమిటంటే… "మనస్విని బాలబొమ్మల" అనే ప్రతిభావంతమైన కళాకారిణి…

Read more