ZEE5లో మార్చి 6 నుంచి ‘గాంధీ టాక్స్’ వరల్డ్ డిజిటల్ స్ట్రీమింగ్
థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ‘గాంధీ టాక్స్’ ఇప్పుడు మార్చి 6 నుండి ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులోకి రానుంది. మూవీమిల్, క్యోరియస్‌తో కలిసి జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాంధీ టాక్స్’లో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ వంటి అద్భుతమైన తారాగణం నటించింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘గాంధీ టాక్స్’ అనేది వ్యక్తిగత నష్టం, ఆర్థిక ఒడిదుడుకులు, నైతిక సందిగ్ధతలను ఎదుర్కొన్న కొందరి వ్యక్తుల…
