ఘనంగా ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ ప్రారంభం.. ఆసక్తి రేకెత్తిస్తున్న కాన్సెప్ట్ పోస్టర్
ఒక్కప్పటిలా లేవు రోజులు.. ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగా ఆడియన్స్ ఆలోచనలు, టేస్ట్ కూడా మారిపోయాయి. కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కొత్త కొత్త కథలతోనే మేకర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఓ వైవిద్యభరితమైన స్టోరీ తీసుకొని, ఇప్పటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాజేష్ జగన్నాధం. S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు…
