మోహన్‌లాల్ పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘ఆపరేషన్ గంగా’
సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఎల్367గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి విష్ణు మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బైజు గోపాలన్, వి.సి. ప్రవీణ్ కో-ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా ఇది. ఆయన తొలి చిత్రం ‘మెప్పడియాన్’తోనే నేషనల్ అవార్డు అందుకుని గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆపరేషన్ గంగా’ ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ చేపట్టిన…
