“సంతాన ప్రాప్తిరస్తు” మంచి విజయాన్ని సాధిస్తుంది – డైరెక్టర్ బాబీ
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్స్ బాబీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ రవి, ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
