“సంతాన ప్రాప్తిరస్తు” ‘అనుకుందొకటిలే..’ లిరికల్ సాంగ్ రిలీజ్
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు" మూవీతో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారారు. ఈ చిత్రంలో ఆయన 'అనుకుందొకటిలే..' పాటను పాడటం విశేషం. "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా 'అనుకుందొకటిలే..' పాటను ఆకట్టుకునేలా రూపొందించారు. 'అనుకుందొకటిలే..' పాట ఎలా ఉందో చూస్తే - అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే,అయిపోలేదులే, గేరే మార్చులే, భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో.. అంటూ వినోదాత్మకంగా సాగుతుందీ పాట. ఈ పాటను సునీల్ కశ్యప్…
