మన శంకరవరప్రసాద్ గారు నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాసీవ్ అప్‌డేట్ ఇప్పుడు వచ్చేసింది. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ఎనర్జీతో నిండిన ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ డాన్స్ పోజుల్లో అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్సర్లతో కలిసి పూర్తి సెలబ్రేషన్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు. డెనిమ్ లుక్, సన్‌గ్లాసెస్‌తో…
