‘ఖుదీరాం బోస్’ పాత్రలో నటించడం నా అదృష్టం
హీరో - రాకేష్ జాగర్లమూడి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఖుదీరాం బోస్. ఆయన జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం 'ఖుదీరాం బోస్'. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన యువ నటుడు రాకేష్ జాగర్లమూడి తన అనుభవాలను, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం... ప్రశ్న: "ఖుదీరాం బోస్" కథ విన్నప్పుడు మీ మొదటి స్పందన ఏమిటి? రాకేష్: నిజం చెప్పాలంటే, కథ వింటున్నంత సేపు నా గుండె వేగంగా కొట్టుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులో ఒక బాలుడు దేశం కోసం చిరునవ్వుతో ఉరికంబం ఎక్కడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ వీరుడి పాత్రను నేను…
