Skip to content

ఈ నెల 16న “ది గర్ల్ ఫ్రెండ్” నుంచి ‘నదివే…’ లిరికల్ సాంగ్ రిలీజ్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'నదివే...' లిరికల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాటను ఈ నెల 16వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 'నదివే...' పాటను బ్యూటిఫుల్ మెలొడీగా కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. చిత్రీకరణ తుది దశలో…

Read more