రామ్ చరణ్ ‘పెద్ది’ శ్రీలంకలో సాంగ్ షూటింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, యూనిట్ సభ్యులు నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంకకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌లో అందమైన ప్రదేశాల్లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్‌లపై ఒక అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు.ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు…
