Skip to content

రామ్ చరణ్ ‘పెద్ది’ శ్రీలంకలో సాంగ్ షూటింగ్

రామ్ చరణ్ ‘పెద్ది’ శ్రీలంకలో సాంగ్ షూటింగ్ Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి.

తాజాగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, యూనిట్ సభ్యులు నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంకకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌లో అందమైన ప్రదేశాల్లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్‌లపై ఒక అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు.ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

బుచ్చిబాబు సానా అత్యంత ప్రెస్టీజియస్ తెరకెకీస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో, ఇప్పటివరకూ ఎన్నడూ చూడని గెటప్‌లతో ప్రజెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం కంప్లీట్ మేకోవర్స్ అవుతూ హై ఆక్టేన్ స్టంట్స్‌ చేయబోతున్నారు.

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఆర్. రత్నవేలు, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్,

‘పెద్ది’ చిత్రం 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

తారాగణం: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత- ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.