Skip to content

‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ సీజ‌న్‌2లో సంద‌డి చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌

జీ5 తెలుగులో విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సీజ‌న్‌లో తొలి ఎపిసోడ్ సాయి ప‌ల్ల‌వితో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. తర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, థ‌మ‌న్ కాంబోలో సెకండ్ ఎపిసోడ్ వ‌చ్చింది. ఇందులో న‌టుడు సునీల్ స్పెష‌ల్ గెస్ట్‌గా క‌నిపించి అల‌రించారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అతిథిగా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ప్రోమోవిడుద‌లైంది.. చూస్తుంటే ఇంట‌ర్వ్యూ చాలా ఫ‌న్నీగా క‌నిపిస్తోంది. నారా లోకేశ్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.. స్కూల్ డేస్‌లో అల్లరి.. ఎక్కువగా పనిష్మెంట్లు నాకే! ఇంట‌ర్వ్యూలో భాగంగా స్కూల్ రోజుల్లో…

Read more

జీ5లో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2

అక్టోబ‌ర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌.. అక్టోబ‌ర్ 18 నుంచి జీ తెలుగు టెలివిజ‌న్‌లో ప్ర‌సారం మన మనసులో నిలిచిపోయే సంభాషణలు చాలాసార్లు మనకు తెలిసిన విషయాలను దాటి, ఒక వ్యక్తిలోని అసలైన మనిషిని పరిచయం చేస్తాయి. జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. సహజమైన నటనతో, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి.. ఈ షో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. మనసులోని మాటలను నిక్కచ్చిగా బ‌య‌ట‌కు తెలిజ‌యేసే సంభాషణలు,…

Read more

జూలై 17న ‘వదలా’ మూవీని చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను – అనిల్ రావిపూడి

ప్రేక్షకులు మా చిత్రాన్ని వదలకుండా చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను - ‘వదలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో జగపతి బాబు చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘తెలుగు ఇండస్ట్రీలోకి నిర్మాతగా వస్తున్న కిషోర్ గారికి…

Read more

‘వదలా’ అందరికీ కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ థ్రిల్లర్: జగపతి బాబు

జగపతి బాబు, లయ, అకెళ్ల వి కృష్ణ, కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్, చరిత చిత్ర ప్రొడక్షన్ 'వదలా' మిస్టరీ గ్రిప్పింగ్ ట్రైలర్ లాంచ్ వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఎమోషన్స్, మిస్టరీ, సస్పెన్స్‌ ఫ్యామిలీ థ్రిల్లర్ 'వదలా'తో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించిన ఈ చిత్రం, ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్, మంచి ఆదరణ పొందిన టీజర్‌తో ఆసక్తిని పెంచింది. ఈ సినిమా జూలై 17న థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్ర బృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. యోగి…

Read more

‘వదలా’ జూలై 17న థియేటర్లలో రిలీజ్

వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు సస్పెన్స్, మిస్టరీ, బలమైన భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ 'వదలా'లో ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లయ, హృతిక శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరిత చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే 'ఫస్ట్ గ్లింప్స్'తో ఆసక్తిని రేకెత్తించగా, టీజర్ అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం జూలై 17న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆకట్టుకునే కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. విడుదల తేదీ పోస్టర్ సినిమా మిస్టీరియస్ వాతావరణాన్ని ఆసక్తికరంగా ప్రతిబింబిస్తోంది. రెడ్ బ్యాక్ డ్రాప్ లో హృతికా శ్రీనివాస్ లోలోపల…

Read more
‘పెద్ది’లో చేసిన అప్పలసూరి పాత్ర నా కెరీర్ లో నెంబర్ వన్ గా నిలుస్తుంది: జగపతి బాబు Telugu News

‘పెద్ది’లో చేసిన అప్పలసూరి పాత్ర నా కెరీర్ లో నెంబర్ వన్ గా నిలుస్తుంది: జగపతి బాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వెర్సటైల్ స్టార్ జగపతి బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 'పెద్ది'లో అప్పలసూరి పాత్ర చాలా కొత్తగా కనిపిస్తోంది.. అది ఎలా సాధ్యమైంది? -ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే దక్కుతుంది. ఆయన…

Read more
‘వదలా’ నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ ‘ఆ నింగీ ఈ నేల’ సాంగ్ రిలీజ్ Telugu News

‘వదలా’ నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ ‘ఆ నింగీ ఈ నేల’ సాంగ్ రిలీజ్

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, థ్రిల్లింగ్ టీజర్‌ , టైటిల్ ట్రాక్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర బృందం ‘ఆ నింగీ ఈ నేల’ అనే అందమైన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ మెలోడీని విడుదల చేసింది. మనసును హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ పాట కుటుంబ అనుబంధాలను ఎంతో అందంగా ఆవిష్కరిస్తోంది. కృష్ణవేణి మల్లవజ్జల అందించిన…

Read more
‘వదలా’ సోల్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్ Telugu News

‘వదలా’ సోల్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, థ్రిల్లింగ్ టీజర్‌ తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు వదలా టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేశారు. ప్రేమ, బాధ, భావోద్వేగాలను ఆత్మీయంగా మిళితం చేసిన ఈ పాట ఒక సోల్‌ఫుల్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. ఎర్రోజు శివకృష్ణాచారి అందించిన సాహిత్యం పాటకు మరింత డెప్త్ తీసుకురాగా, ప్రియా నారాయణ తన వోకల్స్…

Read more
వదలా’   సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది: జగపతి బాబు Telugu News

వదలా’ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది: జగపతి బాబు

జగపతి బాబు, లయ, ఆకెళ్ల వి కృష్ణ, కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్, చరిత చిత్ర ప్రొడక్షన్ 'వదలా' థ్రిల్లింగ్ టీజర్ లాంచ్ వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు థ్రిల్లింగ్ టీజర్‌ ని లాంచ్ చేశారు. యోగి తన భార్యను అమితంగా ప్రేమించే భర్త. ఆమెనే తన ప్రపంచంగా భావిస్తాడు…

Read more
జగపతిబాబు చేతుల మీదగా  “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం Telugu News

జగపతిబాబు చేతుల మీదగా “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హెయిర్ స్టైల్ చేయడంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన రామ్ కొణికి ఇప్పుడు కొత్తగా "కొణికి లక్స్" పేరిట స్కిన్ కేర్ ప్రారంభించడం జరిగింది. టాలీవుడ్ స్టార్ నటులకు, సెలెబ్రిటీకు హెయిర్ స్టైల్ చేయడంలో ఇప్పటికే ఎంతో మంచి తెచ్చుకున్నా రామ్ కొనికి ఇప్పుడు డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి గారు నేతత్వంలో ఎంతో నైపుణ్యం ఉన్న వారి చేత ఎంతో ఆధునిక టెక్నాలజీ తో సర్టిఫైడ్ పరికరాల ద్వారా పర్సనల్ కేర్ తీసుకుని ప్రోటోకాల్ ప్రకారం స్కిన్ కేర్ తీసుకునే దిశగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో నటుడు జగపతిబాబు గారి చేతుల మీదగా సలూన్ కొణికి వద్దనే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నటుడు…

Read more